పొద్దు తిరుగుడు పువ్వు హల్వా
- June 24, 2016
కావలసిన పదార్థాలు: పొద్దు తిరుగుడు విత్తనాలు - 200 గ్రా, పాలు - 100 మి.లీ, పంచదార - 100 గ్రా, యాలకుల పొడి - 5 గ్రా, కుంకుమ పువ్వు - 1 గ్రా, సిల్వర్ ఫాయిల్స్ - 4, నెయ్యి - 50 గ్రా.
తయారుచేసే విధానం
పొద్దుతిరుగుడు విత్తనాల్ని రాత్రంతా పాలల్లో నానబెట్టి ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. పంచదారను నీళ్లలో కలిపి సిరప్‌లా తయారుచేసుకోవాలి. దళసరి అడుగున్న పాత్రలో నేతిని వేసి కొద్దిగా వేడి చేసి, పొద్దుతిరుగుడు పేస్ట్‌ని వేసి సన్నని సెగపై 10 నిమిషాలు వేగించాలి. తర్వాత పంచదార సిరప్‌ని వేసి 5 నిమిషాల వరకూ బాగా కలతిప్పాలి. దించేముందు యాలకుల పొడిని, 10 మిల్లీ లీటర్ల నీటిలో కలిపిన కుంకుమపువ్వును వేయాలి. స్విలర్ ఫాయిల్స్‌తో అలంకరించి తినండి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







