సోయాబిన్ సేకరణలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ

- November 13, 2024 , by Maagulf
సోయాబిన్ సేకరణలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ

తెలంగాణ: కనీస మద్దతు ధరకు సోయాను సేకరించిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్పేర్ జాయింట్ సెక్రటరీ శామ్యూల్ తెలిపారు. సోయాబీన్ ఉత్పత్తి చేసే రాష్ట్రాలయిన కర్ణాటక, మహా రాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల వ్యవసాయ కార్యదర్శులతో ఇప్పటిదాకా జరిగిన సోయాబిన్ సేకరణను సమీక్షించారు.సోయా సేకరణలో సాంప్రదాయ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలను కూడా తెలంగాణ అధిగమించిందని అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 47 సెంటర్ల ద్వారా సోయా సేకరణ జరుగుతుందని, రూ. 4892 మద్దతు ధర చెల్లిస్తూ, ఇప్పటికే 118.64 కోట్ల విలువగల 24,252 మెట్రిక్ టన్నుల సోయా చిక్కుడును, 1464 మంది రైతుల నుండి సేకరించినట్లు వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com