ఒమాన్: డిసెంబర్ లో స్కూల్ ఎవాల్యుయేషన్ కోసం నేషనల్ సిస్టమ్‌

- November 13, 2024 , by Maagulf
ఒమాన్: డిసెంబర్ లో స్కూల్ ఎవాల్యుయేషన్ కోసం నేషనల్ సిస్టమ్‌

మస్కట్: ఒమన్ విజన్ 2040 లక్ష్యంలో భాగంగా  ఒమాన్ లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి కొత్త మూల్యాంకన విధానం ప్రవేశపెట్టారు. ఒమన్ అథారిటీ ఫర్ అకడమిక్ అక్రిడిటేషన్ మరియు క్వాలిటీ అస్యూరెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ (OAAAQA) సుల్తానేట్ ఆఫ్ ఒమాన్ అంతటా విద్య యొక్క నాణ్యతను మెరుగుపరచే లక్ష్యంగా డిసెంబర్ 2న స్కూల్ ఎవాల్యుయేషన్ కోసం నేషనల్ సిస్టమ్‌ను ప్రారంభించనుంది. 

రాయల్ డిక్రీ నంబర్ 9/2021 ప్రకారం కొత్త మూల్యాంకన విధానం ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల పనితీరును మెరుగుపరచడం, జాతీయ మరియు అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడటం లక్ష్యంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు.

మొదటిగా, ఈ కొత్త విధానం విద్యార్థుల సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, మరియు ఆలోచనా విధానాలను పరీక్షిస్తుంది. పాఠశాలలు మరియు కళాశాలలు ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమిస్తాయి.

రెండవది ఈ విధానం విద్యార్థుల వ్యక్తిగత అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. విద్యార్థులు తమకు నచ్చిన రంగాలలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తుంది.

మూడవది, ఈ విధానం విద్యార్థుల సామాజిక మరియు భావోద్వేగ నైపుణ్యాలను కూడా అంచనా వేస్తుంది. విద్యార్థులు తమ సహచరులతో, ఉపాధ్యాయులతో, మరియు సమాజంతో ఎలా మెలుగుతారో ఈ విధానం ద్వారా తెలుసుకోవచ్చు.

చివరగా, ఈ విధానం విద్యార్థుల ప్రగతిని నిరంతరం అంచనా వేస్తుంది. ప్రతి విద్యార్థి యొక్క ప్రగతిని ట్రాక్ చేయడానికి మరియు అవసరమైన మార్పులను చేయడానికి ఈ విధానం ఉపకరిస్తుంది.

ఈ నూతన విద్యా విధానం ప్రధానంగా విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరచడమే కాకుండా విద్యార్థులను సమగ్రంగా అంచనా వేయడంపై దృష్టి సారిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com