పర్యాటకులు, వ్యాపారవేత్తలకు గమ్యస్థానంగా బహ్రెయిన్ వృద్ధి..!!
- November 14, 2024
మనామా: 2025లో పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులకు బహ్రెయిన్ గమ్యస్థానంగా ఎదుగుతుందని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ అంచనా వేస్తుంది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌షో 2024లో ఎమిరేట్స్ ప్యాసింజర్ సేల్స్ , కంట్రీ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ నబిల్ సుల్తాన్ పాల్గొని ఈ మేరకు స్పష్టతనిచ్చారు. రాబోయే నెలల్లో ఫార్వర్డ్ బుకింగ్‌లు ఇప్పటికే బలంగా ఉన్నాయని తెలిపారు. పీక్ సీజన్‌లో ఉన్నందున, ఎమిరేట్స్ మార్చి 2025 వరకు అధిక సీటు ఆక్యుపెన్సీ రేట్లను అంచనా వేస్తుందన్నారు. ఇది సెలవుల కోసం డిమాండ్ తోపాటు స్థిరమైన వ్యాపార కేంద్రంగా మారతుందని తెలియజేస్తుందన్నారు.
ఎమిరేట్స్ దాదాపు రెండు దశాబ్దాల క్రితం విమానాలను ప్రారంభించినప్పటి నుండి బహ్రెయిన్ కు క్రమంగా డిమాండ్ పెరుగుతుందని పేర్కొన్నారు. బహ్రెయిన్‌ను విలక్షణమైన గల్ఫ్ గమ్యస్థానంగా మార్చిన లగ్జరీ హోటళ్ల గురించి వివరించారు. లీజర్ టూరిజంతో పాటు, ప్రాంతీయ ఆర్థిక కేంద్రంగా బహ్రెయిన్ ఎదుగుతుందన్నారు. మల్టీ నేషనల్ బ్యాంకులు, ఇతర అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలను ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌షో ఎమిరేట్స్‌కు దాని గ్లోబల్ నెట్‌వర్క్‌లో అంతర్భాగంగా ఒక వేదికను అందించిందని, ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







