అరుదైన గుండె శస్త్రచికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

- November 16, 2024 , by Maagulf
అరుదైన గుండె శస్త్రచికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

హైదరాబాద్: బీహార్‌కు చెందిన 59 సంవత్సరాల వయస్సు గల ఓం ప్రకాశ్ ప్రసాద్  తీవ్రమైన గుండె వైఫల్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు.ఆయనకు లో ఫ్లో, లో గ్రాడియెంట్ ఎరోటిక్ స్టెనోసిస్ (LF LG AS) అనే అరుదైన గుండె సమస్య  నిర్ధారించబడింది.అందరికి హార్ట్ పంపింగ్ కెపాసిటీ వచ్చి 65% ఉండాలి, కానీ ఈ యొక్క పేషెంట్ కు కేవలం 19% ఉన్నది. 20 లోపు ఉంటె కచ్చితంగా గుండె మార్పిడి చేయాలి కానీ అతనికి ఎరోటిక్ వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్స చేసి ప్రాణాలను కాపాడారు,ఇది అత్యధిక ప్రమాదకరమైన శస్త్రచికిత్స కావడంతో వివిధ ఆసుపత్రులు చికిత్సను నిరాకరించాయి. చివరిగా బేగంపేట మెడికవర్ హాస్పిటల్స్ లోని  సీటీవీఎస్  డాక్టర్ సుధీర్ ని సంప్రదించడం జరిగింది. వివిధ పరీక్షల తరువాత, గుండె సమస్య చాలా క్లిష్టంగా ఉన్నదీ అది కూడా కేవలం 10 శాతం మాత్రమే బ్రతకటానికి వీలుంటుంది.అటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించి పేషెంట్ ప్రాణాలను కాపాడటం జరిగింది. 2024 అక్టోబర్ 23న ఎరోటిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ (వాల్వ్ మార్చడం) శస్త్రచికిత్స నిర్వహించారు.శస్త్రచికిత్స సమయంలో గుండె సాగిపోవడం, వాల్వ్ పూర్తిగా దెబ్బతినడం మరియు మయోకార్డియం (గుండె కండరాలు) తక్కువగా పనిచేయడం వంటి పరిస్థితులు కనబడినప్పటికీ, అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్స పూర్తి చేశారు.పోస్ట్ ఆపరేటివ్ సమయంలో 48 గంటలపాటు వెంటిలేటర్ సపోర్ట్ మరియు క్రమంగా ఐనోట్రోపిక్ సపోర్ట్ (అనేది గుండె మరింత ప్రభావవంతంగా రక్తాన్ని పంప్ చేయడంలో సహాయపడే మందులను ఉపయోగించే చికిత్స) మద్దతు అందించారు. 72 గంటల తర్వాత గుండె పనితీరు మెరుగుపడడంతో మెడిసిన్ మద్దతును స్థిరంగా తగ్గించారు. 7 రోజులు ఐసీయూలో చికిత్స పొందిన తరువాత క్రమంగా అయన ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత పదో రోజు రోగిని డిశ్చార్జ్ చేశారు.ఇలాంటి క్లిష్ట కేసుల్లో, గుండె వైఫల్యాన్ని ముందుగా గుర్తించడం, శస్త్రచికిత్సను సమర్థవంతంగా చేయడం చాలా ముఖ్యం అని అన్నారు. 

అనంతరం పేషెంట్ మాట్లాడుతూ మేము  చాలా హాస్పిటల్స్ తిరిగాము అందరూ కూడా ఇది కష్టతరమైనది చేయలేము అని పంపించారు. చివరికి మెడికవర్ హాస్పటిల్స్ డాక్టర్ సుధీర్ గారు మాకు చికిత్స అందించి నాకు పునర్జన్మ అందించారు అని కొనియాడారు.
డాక్టర్ సాకేత్ మాట్లాడుతూ అన్ని విభాగాలు అనేస్తేషియా, ఆపరేషన్ తర్వాత కార్డియాక్ ఐసీయూ శ్రద్ధ,  ఫిజియోథెరపీ, పోషకాహార విభాగం అన్ని పేషెంట్ త్వరగా రికవరీ అవ్వడం లో ప్రత్యేక పాత్రను పోషించారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధీర్ CTVS సర్జన్,డాక్టర్ సాకేత్ కార్డియాలజిస్ట్, డాక్టర్ మానస - అనస్థీషియాలజిస్ట్, సెంటర్ హెడ్ డాక్టర్ రాజ్ కుమార్ & అభిలాష్ మెడికల్ సూపెరింటెంట్ పాల్గొన్నారు.సెంటర్ హెడ్ గారు రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ అత్యాధునిక సదుపాయాలు , పరికరాలు అనుభవజ్ఞులైన డాక్టర్స్ బృందం వల్లనే ఇటువంటివి సాధ్యపడుతాయి అని అన్నారు. అనంతరం డాక్టర్స్ ని అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com