ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!

- November 06, 2025 , by Maagulf
ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!

దోహా: ఖతార్ లోని ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్‌లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభమైంది. డిసెంబర్ 17 ఇది జరుగనుంది. ఈ ఫెస్టివల్ ను ఖతార్ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ మరియు హస్సాద్ ఫుడ్ కంపెనీ సంయుక్తంగా నిర్వహిస్తుంది. 

ఖతార్ మార్కెట్లో స్థానిక ఉత్పత్తుల భాగస్వామ్యాన్ని విస్తరించడం, స్థానిక రైతులను బలోపేతం చేయడం ఈ ఫెస్టివల్ లక్ష్యంగా పెట్టుకుందని మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ వ్యవసాయ వ్యవహారాల డైరెక్టర్ యూసఫ్ ఖలీద్ అల్-ఖేలైఫీ వెల్లడించారు.   

ఖతార్ ఆహార భద్రతా ప్రయత్నాలను బలోపేతం చేయడం, స్థానిక ఆహార ఉత్పత్తిదారులను ప్రొత్సహించడం, వ్యవసాయ మరియు ఆహార పరిశ్రమల వృద్ధిలో ప్రైవేట్ రంగం పాత్రను పెంచడం పట్ల మంత్రిత్వ శాఖ వ్యూహాత్మక నిబద్ధతను ఈ ఫెస్టివల్ ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.   ఈ ఫెస్టివల్ ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com