బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- November 06, 2025
మనామా: కేరళ ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ రాజు నారాయణస్వామి బహ్రెయిన్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గురువారం స్టూడెంట్స్ గైడెన్స్ ఫోరం మరియు ఎడ్యుపార్క్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆరోజు రాత్రి 8:00 గంటలకు జింజ్‌లోని ఎడ్యుపార్క్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది.
ప్రముఖ వ్యాపారవేత్త మరియు సామాజిక కార్యకర్త కె.జి. బాబురాజ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు, స్టూడెంట్స్ గైడెన్స్ ఫోరం చైర్మన్ అబ్రహం జాన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. డాక్టర్ నారాయణస్వామి పర్యటనతో పాటు, స్టూడెంట్స్ గైడెన్స్ ఫోరం మరియు ఎడ్యుపార్క్ నవంబర్ 7 మరియు 8 తేదీల్లో జింజ్‌లోని ఎడ్యుపార్క్ కాంప్లెక్స్‌లో మినీ మ్యాథ్ ఒలింపియాడ్‌ను కూడా నిర్వహిస్తాయి. వివిధ పాఠశాలల నుండి దాదాపు 50 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పాల్గొనే వారందరికీ సర్టిఫికెట్లు అదజేస్తారు. ఈ మేరకు వివరాలను స్టూడెంట్స్ గైడెన్స్ ఫోరం చైర్మన్ అబ్రహం జాన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







