ఖతార్ లో 300 అరుదైన స్టాంపులు, నాణేలు వేలం..!!

- November 16, 2024 , by Maagulf
ఖతార్ లో 300 అరుదైన స్టాంపులు, నాణేలు వేలం..!!

దోహా: ఖతార్ ఫిలాటెలిక్, న్యూమిస్మాటిక్ సెంటర్ తన వార్షిక వేలాన్ని నిర్వహించింది. దాని ప్రధాన కార్యాలయంలో అరుదైన సేకరణలను ప్రదర్శించారు. వేలంలో స్టాంపులు, నాణేలు, ఎన్వలప్‌లు, ఆల్బమ్‌లు, మొదటి సంచికలు,  స్మారక స్టాంపుల సేకరణలతో సహా 323 వస్తువులు ఉన్నాయి. అలాగే వన్యప్రాణులు, స్వచ్ఛమైన అరేబియా గుర్రాలపై రచించిన నేపథ్య పుస్తకాలు వేలంలో ఉన్నాయని సెంటర్స్ డైరెక్టర్, హుస్సేన్ రజబ్ అల్ ఇస్మాయిల్ తెలిపారు. ఖతార్ స్టాంపులకు అధిక డిమాండ్ ఉందన్నారు.వచ్చే వారం షార్జాలో స్టాంపులు, నాణేల ప్రదర్శన.. ఈ నెలాఖరులో చైనాలోని షాంఘైలో జరిగే స్టాంపులు, నాణేల ప్రదర్శనలో సెంటర్ పాల్గొంటుందని అల్ ఇస్మాయిల్ తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com