ఒమన్ 54వ జాతీయ దినోత్సవం..భారీ ఫైర్ వర్క్స్..వేదికలు ఇవే..!!

- November 16, 2024 , by Maagulf
ఒమన్ 54వ జాతీయ దినోత్సవం..భారీ ఫైర్ వర్క్స్..వేదికలు ఇవే..!!

మస్కట్: 54వ జాతీయ దినోత్సవ వేడుకలకు ఒమన్ సిద్ధమవుతోంది. వేడుకల సందర్భంగా భారీ ఫైర్ వర్క్స్ ప్రదర్శనకు ప్లాన్ చేశారు.  ఈ ఏడాది ఒమన్ సుల్తానేట్‌లోని మూడు ప్రదేశాలలో ఫైర్ వర్క్స్ ను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు జాతీయ వేడుకల సెక్రటేరియట్ జనరల్ ప్రకటించింది.

మస్కట్ గవర్నరేట్: నవంబర్ 18న అల్ ఖౌద్ వద్ద రాత్రి 8 గంటలకు

ధోఫర్ గవర్నరేట్: నవంబర్ 18న అటిన్ మైదానంలో సలాలా విలాయత్ లో రాత్రి 8 గంటల నుండి ఫైర్ వర్క్స్ ప్రారంభం అవుతాయి.

ముసందమ్ గవర్నరేట్: నవంబర్ 21న విలాయత్ ఆఫ్ ఖాసబ్ లో రాత్రి వేడుకలు జరుగుతున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com