ఒమాన్ నేషనల్ డే సందర్భంగా 174 మంది ప్రవాస ఖైదీలకు క్షమాభిక్ష
- November 17, 2024
మస్కట్: ఒమన్ యొక్క 54వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఒమాన్ సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ 174 మంది ప్రవాస ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించారు. ఒమాన్ జాతీయ దినోత్సవ వేడుకల నేపథ్యంలో సుల్తాన్ హైతం బిన్ తారిక్ తనకు ప్రజల పట్ల ఉన్న దయ, కరుణ మరియు సానుభూతిని ఈ క్షమాబిక్ష ద్వారా వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వివిధ నేరాలకు పాల్పడిన వ్యక్తులకు రాయల్ ఒమన్ పోలీసులు క్షమాపణ ప్రకటించారు.
ఈ క్షమాభిక్షను పొందిన ఖైదీలు తమ కుటుంబాలతో తిరిగి కలుసుకోవడానికి, సమాజంలో తిరిగి స్థిరపడడానికి సహాయపడుతుంది.ఈ చర్య ఒమన్ యొక్క శాంతి సామరస్యాన్ని పెంపొందించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఖైదీలకు ఈ రాయల్ క్షమాభిక్ష వారి జీవితాలను సరికొత్త దిశలో తీసుకెళ్లడానికి ఒక అవకాశం కల్పిస్తుంది.
--వేణు_పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







