UAE భారతీయ కమ్యూనిటీతో కలిసి దీపావళిని జరుపుకున్న నహ్యాన్ బిన్ ముబారక్
- November 17, 2024
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లోని భారతీయ కమ్యూనిటీ దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకలకు యూఏఈ మంత్రి నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఆయనతో పాటు భారత రాయబారి సుంజయ్ సుధీర్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. దుబాయ్ లోని జబీల్ పార్క్ లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 60,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.
యూఏఈ ప్రభుత్వ మీడియా కార్యాలయం మరియు దుబాయ్ పోలీస్ ఈ కార్యక్రమానికి మద్దతు అందించిన ఈ కార్యక్రమం “ఎమిరేట్స్ లవ్స్ ఇండియా” అనే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ వేడుకలో భారతీయ సాంస్కృతిక వారసత్వం, కళలు, సంగీతం, మరియు ఫోక్లోర్ ప్రదర్శనలు కనువిందు చేశాయి.
ఈ సందర్భంగా నహ్యాన్ బిన్ ముబారక్ మాట్లాడుతూ ఈ వేడుకల ద్వారా యూఏఈ మరియు భారతదేశం మధ్య ఉన్న స్నేహ సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆయన ఆశ భావం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన దీపావళి పండుగను విశిష్టత తెలియజేస్తూ “అంధకారంపై వెలుగుల విజయం, అజ్ఞానంపై జ్ఞాన విజయం, చెడుపై మంచి విజయం, మరియు సంఘర్షణపై శాంతి విజయం” గా వర్ణించారు.
ఈ వేడుకలో భారతీయ సమాజానికి చెందిన ప్రముఖులను ఆయన సత్కరించారు. వీరిలో డాక్టర్ సురేందర్ సింగ్ కంద్హారి, నిషా జాగ్టియాని, సిద్ధార్థ్ బాలచంద్రన్, రిజ్వాన్ సజాన్, మరియు అతిఫ్ రహ్మాన్ ఉన్నారు. ఈ కార్యక్రమం భారతీయ సమాజం మరియు యూఏఈ మధ్య ఉన్న బలమైన సంబంధాలను ప్రతిబింబించింది.ఈ విధంగా, యూఏఈ లోని భారతీయ కమ్యూనిటీ దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవడం ద్వారా తమ సాంస్కృతిక వారసత్వాన్ని మరియు యూఏఈ తో ఉన్న స్నేహ సంబంధాలను మరింత బలపరిచింది.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







