2024 ఆర్థిక రంగంలో ఒమాన్ సాధించిన విజయాలు, ఘనమైన పురోగతి

- November 17, 2024 , by Maagulf
2024 ఆర్థిక రంగంలో ఒమాన్ సాధించిన విజయాలు, ఘనమైన పురోగతి

- ఒమాన్ 54వ జాతీయ దినోత్సవం: ఆర్థిక విజయాలు మరియు అభివృద్ధి సంబరాలు

- పెట్టుబడిదారుల విశ్వాసం తిరిగి పొందిన ఒమాన్: ఆర్థిక వృద్ధి మరియు ర్యాంకింగ్స్‌లో పురోగతి

- ఒమాన్ విజన్ 2040: అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2024 విజయాలు

- విదేశీ పెట్టుబడులు మరియు క్రెడిట్ రేటింగ్‌లలో ఒమాన్ మెరుగుదల

మస్కట్: 2024లో ఒమాన్ ప్రభుత్వం ఆర్థిక రంగంలో స్థిరత్వాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి మెరుగుపరచడంలో గొప్ప విజయాలు సాధించింది. ఈ సందర్భంగా సుల్తానేట్ ఆఫ్ ఒమాన్ తన 54వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం సాధించిన అభివృద్ధి మరియు పురోగతి విజయోత్సవ సంబరాలను సోమవారం వివిధ ప్రాంతాలలో ఘనంగా జరుపుకుంటుంది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ప్రపంచ చమురు ధరల అస్థిరత, COVID-19 మహమ్మారి లాంటి అనేక సవాళ్లు ఎదుర్కొని పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొంది దేశం ఆర్థికంగా అభివృద్ధిని సాధించింది.

హిజ్ మెజెస్టి ఆదేశాలకు అనుగుణంగా దేశంలోని అన్ని గవర్నెట్స్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలన్న పిలుపుమేరకు గత ఐదు సంవత్సరాలుగా ఒమన్ విజన్ 2040 యొక్క వివిధ లక్ష్యాలలో అనేక రంగాల్లో అభివృద్ధిని కొనసాగిస్తున్నాయి. ఈ విధంగా 2024లో ఒమాన్ అనేక రంగాలలో ప్రగతి సాధించింది. 

2024 ఆర్థిక రంగంలో ఒమాన్ తన స్థిరమైన ఆర్థిక వృద్ధిని కొనసాగించిన ఒమాన్ 2024లో దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి (GDP) పెరిగింది. ప్రభుత్వ ఆదాయాలు 2024లో RO 9.198 బిలియన్ కు చేరుకున్నాయి. ఇది 2023లో RO 8.886 బిలియన్ తో పోలిస్తే 4% పెరుగుదల కనిపించింది. ఒమాన్ తన బడ్జెట్ లో కూడా అధికంగా surplus ను నమోదు చేసింది. 2024లో RO 447 మిలియన్ surplus ను సాధించింది. 2021లో RO 20.8 బిలియన్ నుండి 2024 మధ్య RO 14.4 బిలియన్ కు ప్రజా రుణం తగ్గింది.


ఒమాన్ తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారి గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో ఘనమైన పురోగతి సాధించింది. 2023లో వ్యవస్థాపక సూచికలో 95వ స్థానంలో ఉన్న ఒమన్ ప్రపంచవ్యాప్తంగా 27 స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరుకుంది. ఇక 2024 ఆర్థిక స్వేచ్ఛ సూచికలో 39 స్థానాలు ఎగబాకి ప్రపంచవ్యాప్తంగా 56వ స్థానానికి చేరుకుంది. ఇంకా పర్యావరణ పనితీరు సూచికలో 2022లో 149వ స్థానం నుండి 50వ స్థానానికి చేరుకుంది. విద్యా రంగంలో, సుల్తాన్ కాబూస్ విశ్వవిద్యాలయం 2025 గ్లోబల్ ర్యాంకింగ్ లో 362వ స్థానానికి చేరుకుంది, ఇది గత ర్యాంకింగ్ తో పోలిస్తే 92 స్థానాలు మెరుగైంది.


విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) కూడా పుంజుకుని 2023 చివరి నాటికి RO 25.05 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించింది. 2022లో RO 20.59 బిలియన్ తో పోలిస్తే 21.6% పెరిగింది. ఈ వృద్ధి అంతర్జాతీయ పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా ఒమన్ విదేశీ పెట్టుబడులకు స్వర్గధామం అయింది. ఇంకా మెరుగైన ఆర్థిక నిర్వహణ ఒమాన్ క్రెడిట్ రేటింగ్‌లను గణనీయంగా ప్రభావితం చేసింది. స్టాండర్డ్ & పూర్స్ రేటింగ్ లో స్థిరమైన దృక్పథంతో దేశం యొక్క రేటింగ్‌ను BB+ నుండి BBBకి అప్‌గ్రేడ్ చేసింది, మూడీస్ Ba1 రేటింగ్‌ను కొనసాగిస్తూ దాని దృక్పథాన్ని సానుకూలంగా సవరించింది. ఈ రేటింగ్‌లు ఒమన్ యొక్క మెరుగైన ఆర్థిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి. 

ఈ విజయాలు ఒమాన్ యొక్క ఆర్థిక మరియు సామాజిక రంగాలలో సాధించిన ప్రగతిని ప్రతిబింబిస్తాయి. ఈ జాతీయ దినోత్సవం సందర్భంగా, ఒమాన్ ప్రజలు తమ దేశం సాధించిన విజయాలను గర్వంగా జరుపుకుంటారు.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com