టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా టీటీడీ ఈవో ప్రమాణ స్వీకారం
- November 17, 2024
తిరుమల: టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈవో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అడిషనల్ ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆలయం ముందు ఈవో మీడియాతో మాట్లాడుతూ బోర్డు సభ్యునిగా ప్రమాణస్వీకారం చేయడం శ్రీవారు ఇచ్చిన పవిత్రమైన అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. గత ఐదు నెలలుగా టీటీడీలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. సామాన్య భక్తులకు సౌకర్యాల కల్పన, అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
శ్రీవారి ఆశీస్సులతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు.తిరుమలలో దళారులను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా టీటీడీ బోర్డు ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవో సురేంద్ర, పేష్కార్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







