సౌదీ అరేబియాకు యూఎన్ వరల్డ్ డేటా ఫోరమ్ 2026 హోస్టింగ్ హక్కులు..!!
- November 17, 2024
రియాద్: సౌదీ అరేబియా అధికారికంగా 6వ UN వరల్డ్ డేటా ఫోరమ్ కోసం హోస్టింగ్ హక్కులను పొందింది.ఇది 2026లో రియాద్‌లో జరుగుతుంది. కొలంబియాలోని మెడెల్లిన్లో జరిగిన ఫోరమ్ 5వ ఎడిషన్ ముగింపు సందర్భంగా ఈ ప్రకటన చేశారు. జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) ప్రెసిడెంట్ డాక్టర్ ఫహద్ అల్డోస్సరి రాజ్యం తరపున హక్కుల పత్రాన్ని అందుకున్నారు. "ఈ విజయం సౌదీ అరేబియాలో వివిధ రంగాలలో గణనీయమైన పురోగతికి ప్రతిబింబం" అని అల్డోసరి చెప్పారు. ఈ సందర్భంగానేషనల్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (DANE)కి కూడా కృతజ్ఞతలు తెలిపారు. UN వరల్డ్ డేటా ఫోరమ్ అనేది ప్రభుత్వాలు, జాతీయ గణాంక కార్యాలయాలు, అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలు, పౌర సమాజం, విద్యాసంస్థలు, ప్రైవేట్ రంగానికి చెందిన ప్రతినిధులతో సహా 20,000 మందికి పైగా పాల్గొనే ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమం. ఇది గ్లోబల్ డేటా, గణాంకాలలో సవాళ్లను చర్చించడానికి ఒక వేదికగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







