యువత భద్రం.. మత్తు పదార్థాల వ్యసనంపై షార్జా పోలీసులు అవగాహన..!!
- November 18, 2024
యూఏఈ: షార్జా మాల్‌లో ఒక టీనేజ్ కుర్రాడు మత్తుకు బానిసై పరిసరాలను మరిచి పడుకున్న ఫోటో అందరిని కదిలించింది. ముఖ్యంగా పేరెంట్స్ ను కలవరపాటుకు గురిచేసింది. జాహియా సిటీ సెంటర్‌లో 'మై ఫ్యామిలీ ఈజ్ మై బిగ్గెస్ట్ వెల్త్ 2024' పేరుతో షార్జా పోలీస్ ఎగ్జిబిషన్‌లో భాగంగా ఈ ఫోటోను ప్రదర్శించారు. నవంబర్ 14న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ నవంబర్ 21 వరకు కొనసాగుతుంది. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాలను హాజరైనవారికి అవగాహన కల్పిస్తున్నారు. ఎగ్జిబిషన్‌లో క్రిస్టల్ మెత్, గంజాయి, సింథటిక్ గంజాయి (మసాలా) వంటి వివిధ రకాల మాదకద్రవ్యాలను కూడా ప్రదర్శనకు పెట్టారు.
"ఈ ఎగ్జిబిషన్ తల్లిదండ్రులకు వ్యసనం వల్ల కలిగే నష్టాలు, వారి పిల్లలు ఎదుర్కొనే దుష్ర్పభావాలపై అవగాహన కల్పిస్తున్నారు." అని షార్జా పోలీస్ ప్రతినిధి తెలిపారు. యువత మత్తు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







