జర్మనీలో అప్రెంటిన్షిప్ జాబ్స్, దరఖాస్తులను ఆహ్వానిస్తున్న టామ్‌కామ్
- November 18, 2024
హైదరబాద్: జర్మనీలో అప్రెంటిన్షిప్ చేసి అక్కడే ఉద్యోగాలను పొందేందుకు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ టామ్‌కామ్ విద్యార్దులకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. సాధారణంగ జర్మని యూనివర్సిటీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తారు. ఇక్కడి విద్యా విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
తాజాగా జర్మనీలో అప్రెంటిన్షిప్ మరియు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టామ్‌కామ్ ప్రకటించింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా అర్హులైన యువతకు పెయిడ్ అప్రెంటిషిప్ మరియు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆస్బిల్డుంగ్ ప్రోగ్రామ్ ద్వారా యువతకు ప్రాక్టికల్ ట్రైనింగ్ మరియు వృత్తి నైపుణ్యాలు నేర్పించబడతాయి.
ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన 28 ఏళ్ల లోపు యువత ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు. లాజిస్టిక్స్, టెక్నికల్, ఆతిథ్యం, ఫుడ్ఆక్నాలజీ వంటి రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌లో 2-3 ఏళ్ల పెయిడ్ అప్రెంటిషిప్తో పాటు ఆకర్షణీయ వేతనాలు కూడా ఉంటాయి.
అర్హులైన అభ్యర్థులు టామ్‌కామ్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 9440052592, 8125251408, 9440049013, 9440049645 నంబర్లను సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్దులు తమ కెరీర్‌ను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. జర్మనీలోని ఈ ప్రోగ్రామ్ మంచి భవిష్యత్తును అందించగలదని టామ్‌కామ్ తెలిపింది.
జర్మనీలో అప్రెంటిన్షిప్ చేయడానికి ముందుగా మీరు జర్మన్ భాషలో ప్రావీణ్యం సాధించాలి. చాలా కోర్సులు జర్మన్ భాషలోనే ఉంటాయి, కాబట్టి భాషా నైపుణ్యం అవసరం. అయితే, కొన్ని పీజీ కోర్సులు ఇంగ్లీష్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.
విద్యా విధానం చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. విద్యార్థులు కేవలం పుస్తకాలతోనే కాకుండా, పరిశోధన మరియు ప్రాక్టికల్ అనుభవం ద్వారా కూడా నేర్చుకుంటారు. యూనివర్సిటీలు పరిశ్రమలతో అనుసంధానం కలిగి ఉండటం వల్ల, విద్యార్థులకు రియల్ టైమ్ ప్రాజెక్టులు చేయడానికి అవకాశాలు ఉంటాయి.
వసతుల విషయానికి వస్తే, జర్మనీలోని యూనివర్సిటీల్లో మంచి హాస్టల్ వసతులు ఉంటాయి. విదేశీ విద్యార్థులకు ప్రత్యేకంగా హాస్టల్ సదుపాయాలు అందిస్తారు. అలాగే, విద్యార్థులు సులభంగా అద్దెకు గదులు కూడా దొరుకుతాయి.
జర్మనీలో విద్యార్థులు వారానికి 20 గంటలపాటు పార్ట్‌టైమ్ పని చేయడానికి అనుమతి ఉంది. ఈ అవకాశం విద్యార్థులకు ఆర్థికంగా సహాయపడుతుంది.
మొత్తం మీద, జర్మనీలో అప్రెంటిన్షిప్ చేయడం ద్వారా మంచి విద్యను పొందడమే కాకుండా, ప్రాక్టికల్ అనుభవం కూడా పొందవచ్చు. ఇది మీ కెరీర్‌కు మంచి బాటలు వేస్తుంది.
--వేణు పెరుమాళ్ల (మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!







