షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో మెరిసిన భార‌తీయ స్టూడెంట్స్..!!

- November 18, 2024 , by Maagulf
షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో మెరిసిన భార‌తీయ స్టూడెంట్స్..!!

కువైట్ః కువైట్ లో ఉంటున్న  భారతీయ విద్యార్థులు రీమా, రీయా.. తాము ర‌చించిన  పుస్తకాలను నవంబర్ 13వ  ప్రసిద్ధ షార్జా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించారు. ఇద్దరు సోదరీమణులు ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ (ICSK) అమ్మన్ బ్రాంచ్ విద్యార్థులు. రీమా జాఫర్ 9వ తరగతి, ఆమె సోదరి రీయా జాఫర్ 6వ తరగతి చదువుతున్నారు. చిన్న వయస్సులోనే చిన్నారులు  కవితలు, సృజనాత్మక ఆలోచనలతో పాఠకులను ఆకట్టుకుంటున్నారు.   రీమా, రీయా కేరళలోని కన్నూర్‌కు చెందిన డాక్టర్ జాఫరాలి పరోల్స,  హమ్జాకుట్టి సంతానం.  
రీమా , రీయా కువైట్ నేషనల్ టీవీలో హోస్ట్‌లు, అక్కడ వారు తమ ప్రేక్షకులకు అనేక రకాల పుస్తకాలను పరిచయం చేస్తున్నారు. వారి కార్యక్రమం ఇప్పటివరకు 120 ఎపిసోడ్‌లకు పైగా విజయవంతంగా ప్రసారం చేయబడింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com