భారతీయ కమ్యూనిటీ సభ్యులకు 'వ్యక్తుల అక్రమ రవాణా'పై అవగాహన..!
- November 18, 2024
బహ్రెయిన్: బహ్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం, బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ (IOM) సహకారంతో భారతీయ కమ్యూనిటీ సభ్యులకు 'వ్యక్తుల అక్రమ రవాణా' అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించింది. ఎంబసీ ప్రాంగణంలో లేబర్ మార్కెట్ కు సంబంధించిన అంశాలపై బహ్రెయిన్ ప్రభుత్వం అవగాహన కల్పించారు. 'వర్కింగ్ టుగెదర్' కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ భారతీయ సంఘాలు, ప్రైవేట్ కంపెనీలు, మ్యాన్‌పవర్ ఏజెన్సీల ప్రతినిధులతో సహా భారతీయ కమ్యూనిటీ సభ్యులు హాజరయ్యారు. రాయబారి HE Mr. వినోద్ K. జాకబ్ మాట్లాడుతూ.. బహ్రెయిన్‌లోని భారతీయ ప్రవాసులు ఆతిథ్య ప్రభుత్వ చట్టాలు, నియమాలు, నిబంధనలను అనుసరించాలని, అదే సమయంలో స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా భారతీయ సమాజ ప్రయోజనాలను పరిరక్షించినందుకు LMRAతో సహా బహ్రెయిన్ ప్రభుత్వానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







