ఒమన్‌లో ఒక్క నెలలో 1.7 మిలియన్ వాహనాలు నమోదు..!!
- November 19, 2024
మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జారీ చేసిన తాజా డేటా ప్రకారం.. సెప్టెంబర్ 2024 చివరి నాటికి ఒమన్ సుల్తానేట్‌లో నమోదైన మొత్తం వాహనాల సంఖ్య 1,728,931కి చేరుకుంది. ఒమన్‌లో నమోదైన మొత్తం వాహనాల్లో 79.6% ప్రైవేట్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలు 1,376,221 వద్ద ఉండగా, వాణిజ్య రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాల సంఖ్య 251,305కి చేరుకుంది. కాగా, ట్యాక్సీ వాహనాల సంఖ్య 28,174కు చేరగా.. అద్దె వాహనాల సంఖ్య 37,890కి చేరింది. ప్రభుత్వ వాహనాల సంఖ్య 11,849 కాగా, మోటార్‌బైక్‌ల సంఖ్య 7,534గా ఉన్నాయి.
డ్రైవింగ్ స్కూల్ వాహనాల సంఖ్య 5,247, తాత్కాలిక రిజిస్ట్రేషన్ (తాత్కాలిక తనిఖీ, ఎగుమతి మరియు దిగుమతి) కలిగిన వాహనాల సంఖ్య 8,575గా ఉంది. అంతేకాకుండా, ట్రాక్టర్ల సంఖ్య 1,256, 880 దౌత్య సంస్థల రిజిస్ట్రేషన్లు కలిగిన వాహనాలు ఉన్నాయి. 1,500 - 3,000 ccs మధ్య ఇంజిన్ సామర్థ్యం పరంగా నమోదైన వాహనాల సంఖ్య 939,398.. 3,001 - 4500 ccల మధ్య ఇంజిన్ సామర్థ్యం గల వాహనాల సంఖ్య 386,743కి చేరుకుంది. 1,500 ccs కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్నవి 251,382గా ఉన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







