టాక్సీలలో స్మోకింగ్ కు ఏఐతో చెక్.. ఉల్లంఘనలను గుర్తించేందుకు ట్రాక్..!!

- November 19, 2024 , by Maagulf
టాక్సీలలో స్మోకింగ్ కు ఏఐతో చెక్.. ఉల్లంఘనలను గుర్తించేందుకు ట్రాక్..!!

దుబాయ్: టాక్సీల లోపల స్మోకింగ్ ను గుర్తించేందుకు దుబాయ్ కృత్రిమ మేధస్సు (AI)ని ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తోంది. రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) కారులో కెమెరాల ద్వారా దీన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఎమిరేట్స్ లో పబ్లిక్ రవాణా మార్గాలలో స్మోకింగ్ ను నిషేధించారు. ఎమిరేట్ అంతటా టాక్సీ సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో అధికార యంత్రాంగం అనేక కార్యక్రమాలు ప్రారంభించింది. 500 కంటే ఎక్కువ విమానాశ్రయ టాక్సీలలో "అధిక-నాణ్యత ఎయిర్ ఫ్రెషనర్లను" ఉపయోగించడానికి పైలట్ దశను ప్రారంభించినట్టు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ, RTAలో ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ అడెల్ షాక్రి తెలిపారు."డ్రైవర్‌లతో పాటు కంపెనీలు, డ్రైవింగ్ స్కూల్‌లలో బోధకులకు అవగాహన శిక్షణా కార్యక్రమాలను తీవ్రతరం చేయడం ఈ కార్యక్రమాలలో ఉన్నాయి.” అని పేర్కొన్నారు. ట్యాక్సీ పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన కొత్త కార్యక్రమాల ప్రభావాన్ని అథారిటీ ట్రయల్ రన్ లో అంచనా వేస్తుందని తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com