RAK బీచ్‌లో ముగ్గురిని సేఫ్ చేసిన సిటిజన్స్..!!
- November 19, 2024
యూఏఈ: రస్ అల్ ఖైమాలోని బీచ్ వద్ద ముగ్గురు యువకులను స్థానికులు రక్షించారు. చేపలు పడుతుండగా ఉవ్వెత్తున ఎగిసిన అలల కారణంగా ఒడ్డుకు చేరుకోలేక పోయామని యువకుల్లో ఒకరు తెలిపారు. సమాచారం అందుకున్న రస్ అల్ ఖైమా పోలీసులు.. సెర్చ్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ సంఘటనా స్థలానికి చేరుకునే లోపే, అక్కడ ఉన్న స్థానికులు ముగ్గురు వ్యక్తులను రక్షించి సురక్షితంగా బీచ్‌కు తీసుకువచ్చారు. ప్రాణాలతో బయటపడిన ముగ్గురికి అధికార యంత్రాంగం వైద్యపరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా యువకులను రక్షించిన ప్రజల సహకారాన్ని పోలీసులు ప్రశంసించారు. చేపలు పట్టేటప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు సముద్ర ఆటుపోట్లపై జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!







