ఈ సమస్యలు దూరం కావాలంటే పూల్ మఖానా తినాల్సిందే

- November 19, 2024 , by Maagulf
ఈ సమస్యలు దూరం కావాలంటే పూల్ మఖానా తినాల్సిందే

ఫూల్ మఖానా.. వీటిని మనం స్నాక్స్‌లా, ఫ్రై చేసుకుని సైడ్ డిష్, ఉడికించుకుని, డెజర్ట్స్‌లా చేసుకుని తింటారు. ఈ మఖానాలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో పిండి పదార్థాలు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. ఎముకల ఆరోగ్యానికి మఖానాలోని కాల్షియం హెల్ప్ చేస్తుంది. రక్తపోటు తగ్గిస్తుంది. దీంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. మెగ్నీషియం శరీరంలోని జీవక్రియ ప్రతిచర్యలకు అవసరం. ప్రోటీన్ సంశ్లేషణ, కండరాల సంకోచాలు, నరాల పనితీరు అన్నింటికీ మెగ్నీషియం హెల్ప్ చేస్తుంది.

కొన్ని అధ్యయనాల ప్రకారం మఖానా తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఎలుకల్లో జరిగిన అధ్యయనాల ప్రకారం షుగర్ ఉన్న ఎలుకలకి మఖానా ఎక్స్‌ట్రాక్ట్స్ ఉన్న సప్లిమెంట్స్ అందించడం వల్ల రక్తంలో షుగర్ కంట్రోల్ అయిందని తేలింది. దీని కారణంగా యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్ కూడా పెరిగినట్లు తేలింది. మరో అధ్యయనం ప్రకారం మఖానా సీడ్స్ తిన్న ఎలుకల్లో బల్డ్ షుగర్ లెవల్స్, ఇన్సులిన్ స్థాయిలు మెరుగ్గా ఉన్నాయని తేలింది. వీటి కారణంగా బల్డ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసేందుకు మఖానా ఎక్స్‌ట్రాక్ట్ హెల్ప్ చేస్తుందని తేలింది. అయితే, ఇది మానవులకి హెల్ప్ చేస్తుందనే విషయంలో మరిన్ని అధ్యయనాలు అవసరం.

ఫూల్ మఖానాలోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండె సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ నుండి కాపాడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, మఖానా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. నాన్ ఫ్యాటీ లివర్ ఉన్న ఎలుకలపై 4 వారాల పాటు కొనసాగిన అధ్యయనంలో మఖానా ఎక్స్‌ట్రాక్ట్స్ తీసుకున్న ఎలుకల్లో కొలెస్ట్రాల్ లెవల్స్, ట్రై గ్లిజరైడ్ లెవల్స్ తగ్గి గుండె సమస్యలు తగ్గినట్లు తేలింది. కాబట్టి, ఈ గింజలు గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మఖానాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన బాడీలోని ఫ్రీ రాడికల్స్‌ని దూరం చేస్తాయి. ఇందులో ముఖ్యంగా గల్లిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్, ఎపికాటెచిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ మంటను తగ్గిస్తాయి. దీంతో రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, సోరియాసిస్, ఇన్‌ఫ్లమేటరీ ప్రేగు సమస్యలు దూరమవుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com