సైబరాబాద్‌లో మరో స్కాం..
- November 20, 2024
హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో భారీ స్కాం వెలుగుచూసింది. రూ.300 కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేసింది ఓ సంస్థ. కూకట్పల్లి కేంద్రంగా 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ పేరుతో బడా మోసానికి పాల్పడింది. ఈ మోసంలో 3600 మంది బాధితులు చిక్కుకుపోయారు. తమ కంపెనీలో 8 లక్షల 8 వేల రూపాయలు కనీస పెట్టుబడిగా పెట్టి రెండు గుంటల స్థలాన్ని కొనుగోలు చేస్తే, 25 నెలల పాటు ప్రతి నెలా 4 శాతం చొప్పున అంటే నెలకు రూ.32 వేలు చెల్లిస్తామని జోరుగా ప్రచారం చేశారు. అంతేకాకుండా.. ఈ స్కీమ్‌లో మరెవరినైనా చేర్పించినా వారికి 25 నెలల పాటు ప్రతి నెలా రూ.7200 చొప్పున చెల్లిస్తామని ఆశ చూపింది 12 వెల్త్ సంస్థ.
ఇదేగాక.. డబుల్ గోల్డ్ స్కీమ్‌లో కనీసం రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే 12 నెలల తరువాత రూ.8 లక్షల విలువ చేసే స్విట్జర్లాండ్ గోల్డ్ బిస్కెట్ ఇస్తామని ట్రాప్ చేశారు. అంతేకాకుండా.. గోల్డ్ చిట్ స్కీమ్ పేరుతో మరో వల వేశారు. 5 లక్షల రూపాయలను 20 నెలల పాటు పెట్టుబడిగా పెడితే 19 నెలల పాటు నెలకు 15 వేల చొప్పున ప్రతి నెలా చెల్లిస్తామని.. 20వ నెల మరో 15 వేలు అదనంగా చెల్లిస్తామని నమ్మించారు కేటుగాళ్లు. ఈ క్రమంలో 3600 మంది బాధితులు పెట్టుబడి పెట్టి మోసపోయారు.
తాము మోసపోయామని తెలుసుకుని సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఈ క్రమంలో.. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రై.లి. ఎండీ కలిదిండి పవన్ కుమార్ సహా మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఈ కేసులో కంపెనీ డైరెక్టర్లు వల్లభనేని రవికుమార్ చౌదరి, కాకర్ల గిరిబాబు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







