ఈ వారంలో ఒమన్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

- November 20, 2024 , by Maagulf
ఈ వారంలో ఒమన్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

మస్కట్: అల్ హజర్ పర్వత ప్రాంతాలలో ఏర్పడిన మేఘాల కారణంగా ఈ వారంలో ఒమాన్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేఘాల కారణంగా ఉత్తర షర్కియా, దఖిలియా, మస్కట్, నార్త్ బతినా మరియు దక్షిణ బతినా గవర్నరేట్‌ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, అల్ వుస్తా మరియు ధోఫర్ గవర్నరేట్‌ల తీరం వెంబడి కూడా మధ్యస్థ మేఘాలు కమ్ముకుని, అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి.

అయితే ఒమాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా నాలుగు రోజుల సెలవులు ప్రకటించడంతో ప్రజలు ఈ సమయాన్ని ప్రయాణాలకు వినియోగించుకోవాలని భావిస్తున్నారు. కావున ఈ వారాంతంలో ఒమాన్ అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రయాణికులు రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించాలనీ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పర్వత ప్రాంతాలు మరియు తీర ప్రాంతాల్లో వర్షం లేదా మేఘాల కారణంగా దృశ్యమానత తగ్గే అవకాశం ఉండడంతో డ్రైవింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

ఇంకా వర్షాల కారణంగా ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వర్షాల సమయంలో రోడ్లపై నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది కాబట్టి, డ్రైవింగ్ చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. వర్షాల కారణంగా రోడ్లు చిత్తడిగా మారవచ్చు, అందువల్ల వేగంగా డ్రైవ్ చేయకుండా, నెమ్మదిగా, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇంకా వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లో మట్టి త్రవ్వకాలు, రాళ్ల పడి ప్రమాదం ఉండవచ్చు. అందువల్ల, కొండ ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలి.

అలాగే వర్షాల సమయంలో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్య కారులు వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడం మంచిది. వాతావరణ శాఖ సూచనలను పాటించడం, అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం సంబంధిత అధికారులను సంప్రదించడం అవసరం.

--వేణు పెరుమాళ్ల(మాదిగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com