ఐఫోన్ యూజర్లకు అలర్ట్..

- November 20, 2024 , by Maagulf
ఐఫోన్ యూజర్లకు అలర్ట్..

ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ప్రధాన సెక్యూరిటీ అప్‌డేట్ వచ్చేసింది. వెంటనే యూజర్లు తమ డివైజ్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.కొత్త ఐఓఎస్ 18.1.1 అప్‌డేట్ అనేది కొన్ని ప్రధాన లోపాలను పరిష్కరించేందుకు ఆపిల్ జారీ చేసిన ఎమర్జెన్సీ ప్యాచ్‌లలో ఒకటి. ఐఓఎస్ 18.1 అప్‌డేట్ కొన్ని వారాల క్రితమే రిలీజ్ అయింది. మొదటిసారిగా సపోర్టు చేసే ఐఫోన్ మోడల్‌లకు ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను అందిస్తోంది. కంపెనీ ప్లాట్‌ఫారమ్‌ల సెక్యూరిటీపరమైన ఆందోళనలను గుర్తిస్తే.. ఈ ఎమర్జెన్సీ అప్‌డేట్స్ ద్వారా ఇష్యూలను ఫిక్స్ చేయొచ్చు.

ఐఫోన్ల కోసం ఐఓఎస్ 18.1.1 అప్‌డేట్:
ఐఫోన్ యూజర్ల కోసం కొత్త ఐఓఎస్ 18.1.1 వెర్షన్‌ను ఆపిల్ నవంబర్ 19, 2024న రిలీజ్ చేసిన రాపిడ్ సెక్యూరిటీ రెస్పాన్స్ అప్‌డేట్ అంటారు. వివరణాత్మక ఆపిల్ సెక్యూరిటీ సపోర్ట్ పేజీలో వెబ్‌సైట్‌ను మార్చే జావాస్ర్కిప్ట్‌కోర్, వెబ్‌కిట్ సమస్యలను ఆపిల్ ప్రస్తావించింది.

ఏ ఐఫోన్లలో ఈ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయాలంటే?
ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ లేదా అంతకంటే ఎక్కువ ఐఫోన్ మోడల్‌ను కలిగిన ఎవరైనా ఎమర్జెన్సీ ఐఓఎస్ 18.1.1 వెర్షన్‌ను వెంటనే ఇన్‌స్టాల్ చేయాలని ఆపిల్ చెబుతోంది. అదేవిధంగా, మీరు ఐప్యాడ్ యూజర్లు ఆందోళనలను ఐప్యాడ్‌ఓఎస్18.1.1 అప్‌డేట్ పొందవచ్చు. ఈ కొత్త వెర్షన్‌కి అప్‌డేట్ చేయాల్సిన అన్ని మోడల్‌లు అందుబాటులో ఉన్నాయి.

  • ఐఫోన్ ఎక్స్ఎస్, ఆపై వెర్షన్
  • ఐప్యాడ్ ప్రో 13-అంగుళాలు
  • ఐప్యాడ్ ప్రో 12.9-అంగుళాలు
  • 3వ జనరేషన్, ఆపై వెర్షన్
  • ఐప్యాడ్ ప్రో 11-అంగుళాలు
  • 1వ జనరేషన్, ఆపై వెర్షన్
  • ఐప్యాడ్ ఎయిర్ 3వ జనరేషన్, ఆపై వెర్షన్
  • ఐప్యాడ్ 7వ జనరేషన్, ఆపై వెర్షన్
  • ఐప్యాడ్ మినీ 5వ జనరేషన్, ఆపై వెర్షన్
  • ఐఫోన్ సెట్టింగ్స్ – జనరల్ – సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ ద్వారా కొత్త ఐఓఎస్ లేదా ఐప్యాడ్ఓఎస్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు. మీ ఫోన్ ప్రొటెక్ట్ చేసేందుకు కొత్త వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com