ఎమిరటైజేషన్ విధానాల ఉల్లంఘన..1,900 ప్రైవేట్ సంస్థలకు భారీగా జరిమానా..!!

- November 21, 2024 , by Maagulf
ఎమిరటైజేషన్ విధానాల ఉల్లంఘన..1,900 ప్రైవేట్ సంస్థలకు భారీగా జరిమానా..!!

యూఏఈ: 2022 మధ్య నుండి 2024,19 నవంబర్ వరకు 1,934 ప్రైవేట్ కంపెనీలు ఎమిరేటైజేషన్ విధానాలను ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు యూఏఈ అథారిటీ ప్రకటించింది. లక్ష్యాలను చేధించేందుకు ఈ కంపెనీలు విధానాలను ఉల్లంఘించి నకిలీ ఎమిరేటైజేషన్‌లో 3,035 మంది యూఏఈ పౌరులను నియమించుకున్నాయని మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో, 22,000 కంటే ఎక్కువ ప్రైవేట్ సంస్థలు అదే కాలంలో ఎమిరాటీస్ విధానాలకు అనుగుణంగా ఎమిరాటీలను నియమించుకున్నాయని తెలిపింది.  

ఎమిరేటైజేషన్ బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ఏవైనా ప్రయత్నాలు చేస్తే కఠినంగా, చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తామని అథారిటీ తెలిపింది. ఉల్లంఘించిన సంస్థలపై Dh20,000 నుంచి Dh500,000 మధ్య జరిమానా విధించనున్నట్లు తెలిపింది. కేసు తీవ్రతను బట్టి, ఉల్లంఘించిన కంపెనీ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేస్తామన్నారు.  డిసెంబరు చివరి నాటికి తమ 2024 ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవాలని అథారిటీ ఇటీవల ప్రైవేట్ రంగ కంపెనీలకు అలెర్ట్ జారీ చేసింది. నిబంధనలకు అనుగుణంగా లేని సంస్థలు జనవరి 1, 2025 నుండి భారీ జరిమానాలు చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేసింది.  కాల్ సెంటర్‌కు 600590000 లేదా మంత్రిత్వ శాఖ స్మార్ట్ యాప్ మరియు వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు చేయాలని అథారిటీ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com