NCLT తీర్పుతో 46వేల కోట్ల ప్రజాధనం లీగల్ గా నాశనం
- November 22, 2024
దేశంలో బ్యాంకుల వద్ద వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రుణంగా పొందిన పెద్ద కంపెనీలు ఆ రుణాన్ని ఒక్క పైసా కట్టకుండా లీగల్ గా క్లెయిమ్ చేసుకుంటాయనీ తెలుసా..? తాజాగా NCLT తీర్పుతో 46వేల కోట్ల ప్రజాధనం లీగల్ గా నాశనం అయింది.ఈ ప్రజాధనం ఎవరి జేబులోకి వెళ్తుంది?దేశాల్లో పావలా అర్ధ రూపాయి చెలామణి మర్చిపోయి సంవత్సరాలైంది.
అలాంటిది 100 రూపాయల రుణానికి పావలా సెటిల్మెంట్ ఎక్కడైన విన్నారా? నిజంగా వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన సంస్థలు ఏడాది తిరగకముందే పూర్తిగా ఎలా నష్టపోతాయి అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.
దేశంలో బడా బడా కంపెనీల దివాలా సమస్యలను సత్వరంగా పరిష్కరించడం కోసం అలాగే పెద్ద పెద్ద కంపెనీలు అప్పులు తీర్చలేకపోతే ఆ కంపెనీల రుణదాతలు నష్టపోకుండా.. కంపెనీ ఆస్తులను సక్రమంగా విక్రయించి రుణదాతలకు న్యాయం చేయడం కోసం 2016లో ఇండియన్ గవర్నమెంట్ National Company Law Tribunal (NCLT) అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రధానంగా ఇండియాలో నస్టాలలో ఉన్న కంపెనీల సమస్యలపై తీర్పులు ఇస్తుంది. తద్వారా NCLT, కంపెనీల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి, ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ తీర్పులు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఇటీవలి కాలంలో HDIL, Radius Estates and Developers, National Rayon Corporation, Essar Power MP Ltd, Dighi Port Limited, Lanco Amarkantak Power, Coastal Energen Ltd, Aditya Estates, Karaikal Port, Korba West Power Company అనే పది కంపెనీలు అప్పులు చేసి, దివాలా తీసామని ప్రకటించాయి. ఈ కంపెనీలు NCLT దగ్గరకు వెళ్లి, రుణదాతల కమిటీ (Committee of Creditors) ఏర్పాటు చేయమని కోరాయి. NCLT ఈ కమిటీకి ఒక Resolution Professional ను నియమిస్తుంది. ఈ Resolution Professional రుణదాతలతో బేరసారాలు చేస్తాడు.
ఈ బేరసారాలు ముగిసిన తరువాత ఎవరైనా వెళ్ళి సెటిల్మెంట్ అయిన ధరకు ఆ కంపెనీలు కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు, 100కి 20కు సెటిల్ అయిందనుకుందాం. మనం వెళ్ళి ఆ 20 ఇస్తే ఆ కంపెనీలు మనకు అమ్మేస్తారు. ఇదే NCLT పని.పైన చెప్పిన కంపెనీలు 100కి 25.8కు NCLT సెటిల్మెంట్ చేసింది. ఈ సెటిల్మెంట్ లో ఆ పది కంపెనీలు అదానీ కొనుగోలు చేసారు. అంటే రుణదాతలు 74.1 శాతం నష్టపోయారు. ఈ రుణదాతలలో ప్రధానమైనవి బ్యాంకులే. ఈ పది కంపెనీలు 62000 కోట్ల రూపాయలు రుణదాతలకు అంటే బ్యాంకులకు చెల్లించాలి. కానీ NCLT 16000 కోట్ల రూపాయలకు సెటిల్మెంట్ చేసింది. అంటే ఈ 46000 కోట్ల రూపాయలు నష్టంతో సెటిల్ మెంట్ చేసింది. మరి ఈ నష్టపోయిన ప్రజాధనం ఎవరి జేబుల్లోకి పోయింది?ఈ విధంగా దేశంలో బ్యాంకుల వద్ద వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రుణంగా పొందిన పెద్ద కంపెనీలు ఆ రుణాన్ని ఒక్క పైసా కట్టకుండా లీగల్ గా క్లెయిమ్ చేసుకుంటాయి.
ఇటీవల కాలంలో NCLT దివాలా తీసిన కంపెనీల రుణదాతలకు ఎలా న్యాయం చేసిందో కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం.
Essar Steel India Ltd: ఈ కంపెనీ దివాలా ప్రక్రియలో NCLT, COC, RP కీలక పాత్ర పోషించాయి. Essar Steel రుణదాతలకు 54,000 కోట్ల రూపాయలు చెల్లించలేకపోయింది. NCLT, COC ను ఏర్పాటు చేసి, RP ను నియమించింది. చివరికి, ArcelorMittal కంపెనీ Essar Steel ను కొనుగోలు చేసింది.
Bhushan Steel Ltd: Bhushan Steel కూడా దివాలా ప్రక్రియలో NCLT, COC, RP ద్వారా పరిష్కరించబడింది. ఈ కంపెనీ రుణదాతలకు 56,000 కోట్ల రూపాయలు చెల్లించలేకపోయింది. NCLT, COC ను ఏర్పాటు చేసి, RP ను నియమించింది. చివరికి, Tata Steel కంపెనీ Bhushan Steel ను కొనుగోలు చేసింది.
ఇలా వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన సంస్థలు ఏడాది తిరగకముందే పూర్తిగా ఎలా నష్టపోతాయి. నిజంగా వారు నష్టపోయారా? కావాలని వారి చేత దివాలా చూపించారా? అనేది సగటు మధ్య తరగతి మానవుడి ప్రశ్న. సామాన్య ప్రజానీకానికి రూపాయి రుణం కోసం సవాలక్ష ప్రశ్నలు అడిగే బ్యాంకులు వేలకోట్ల రూపాయల ప్రజాధనం రుణంగా ఇస్తున్నపుడు తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఆలోచించాల్సిన విషయం. NCLT, COC, RP లో ఉన్న వాళ్ళు కుమ్మక్కు అయి లీగల్ గా బ్యాంకింగ్ రంగాన్ని నాశనం చేస్తున్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
NCLT, COC, RP అంటే ఏమిటి? వీటి ప్రధాన విధులు తెలుసుకుందాం:
National Company Law Tribunal (NCLT), Committee of Creditors (COC), మరియు Resolution Professional (RP) అనే పదాలు కంపెనీల దివాలా ప్రక్రియలో ముఖ్యమైనవి. ఈ మూడు అంశాలు కలిసి కంపెనీల సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.
National Company Law Tribunal (NCLT)
NCLT అనేది 2016లో ఏర్పాటు చేయబడిన సంస్థ. ఇది కంపెనీల సమస్యలను పరిష్కరించడానికి మరియు దివాలా ప్రక్రియను సులభతరం చేయడానికి ఏర్పాటు చేయబడింది. NCLT, కంపెనీల చట్టం 2013 (Companies Act, 2013) ప్రకారం కంపెనీలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి మరియు దివాలా ప్రక్రియను నిర్వహించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. NCLT ప్రధానంగా కంపెనీల దివాలా ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. కంపెనీలు తమ అప్పులను తీర్చలేకపోతే, NCLT దగ్గరకు వెళ్లి దివాలా ప్రక్రియను ప్రారంభించవచ్చు. NCLT, రుణదాతల కమిటీ (COC) మరియు రిజల్యూషన్ ప్రొఫెషనల్ (RP) ను నియమిస్తుంది.
Committee of Creditors (COC)
COC అనేది రుణదాతల కమిటీ. ఇది కంపెనీకి అప్పు ఇచ్చిన రుణదాతలతో ఏర్పడుతుంది. ఈ కమిటీ కంపెనీ దివాలా ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. COC, రిజల్యూషన్ ప్రొఫెషనల్ (RP) తో కలిసి కంపెనీకి సంబంధించిన బేరసారాలు, సెటిల్మెంట్లు నిర్వహిస్తుంది. COC, కంపెనీకి సంబంధించిన అన్ని నిర్ణయాలను తీసుకుంటుంది. రుణదాతలు తమ అప్పులను ఎంత మేరకు తిరిగి పొందగలరో నిర్ణయించడంలో COC కీలక పాత్ర పోషిస్తుంది.
Resolution Professional (RP)
RP అనేది రిజల్యూషన్ ప్రొఫెషనల్. ఈయన NCLT ద్వారా నియమించబడతాడు. RP, కంపెనీ దివాలా ప్రక్రియను పర్యవేక్షిస్తాడు మరియు రుణదాతలతో బేరసారాలు చేస్తాడు.
RP, కంపెనీ ఆస్తులను అమ్మడం, రుణదాతల అప్పులను తీర్చడం వంటి పనులను నిర్వహిస్తాడు. RP, రుణదాతల కమిటీ (COC) తో కలిసి, కంపెనీకి సంబంధించిన అన్ని నిర్ణయాలను తీసుకుంటాడు.
NCLT, COC, RP అనే పదాలు కంపెనీల దివాలా ప్రక్రియలో కీలకమైనవి. ఈ మూడు అంశాలు కలిసి, కంపెనీల సమస్యలను పరిష్కరించడంలో మరియు రుణదాతల అప్పులను తిరిగి పొందడంలో కీలక పాత్ర పోషిస్తాయి. NCLT, కంపెనీల దివాలా ప్రక్రియను సులభతరం చేయడంలో మరియు రుణదాతలకు న్యాయం చేయడంలో ముఖ్యమైనది. COC, రుణదాతల ప్రయోజనాలను కాపాడడంలో మరియు RP, కంపెనీ ఆస్తులను సక్రమంగా నిర్వహించడంలో కీలకమైనవి.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







