మరోసారి రెఫరెండం కోసం డిమాండ్..
- June 25, 2016
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పలు ప్రాంతాలకు చెందిన ఆ దేశ వాసులు రెండో రెఫరెండం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇందు కోసం ఓ వెబ్సైట్లో పెట్టిన పిటిషన్‌పై సంతకాలు చేసిన వారి సంఖ్య ఒక మిలియన్ దాటింది. సంతకాలు చేసిన వారిలో ఎక్కువగా లండన్, బ్రిగ్టన్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, మాంచెస్టర్ నుంచి ఉన్నారు. వీరంతా బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినవారే.
ఒక మిలియన్ సంతకాలు చేసిన ఈ పిటిషన్ బ్రిటిష్ పార్లమెంట్లో చర్చకు రానుంది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో దీనిపై చర్చించనున్నారు. ఈ పిటిషన్‌ను ప్రారంభించిన విలియన్ ఒలివర్ మాట్లాడుతూ' మొత్తం 75 శాతం కంటే తక్కువగా నమోదైన ఓటింగ్‌లో ఈయూ నుంచి వైదొలగడం లేదా కొనసాగడం 60 శాతం కంటే తక్కువ ఉందని.. ఈ నేపథ్యంలో రెండో రిఫరెండాన్ని నిర్వహించి మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఎక్కువ సంఖ్యలో ప్రజలు రెండో రెఫరెండం కోసం తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఈ పిటిషన్ కోసం ఏర్పాటు చేసిన వెబ్సైట్ ఓ దశలో స్తంభించిపోయింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







