వయనాడ్‌లో గెలుపు పై ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్యలు
- November 24, 2024
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి, విజయం సాధించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ ఎంపీ స్థానం ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీ 4 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. దీనిపై ప్రియాంకా గాంధీ స్పందించారు.
“వయనాడ్‌లోని సోదరులు, సోదరీమణులు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞత చెబుతున్నాను. ఈ గెలుపు మీ గెలుపే. మీకు ప్రాతినిధ్యం వహించడానికి మీరు ఎన్నుకున్న నేను మీ ఆశలు, కలలను అర్థం చేసుకుంటాను.. మీ కోసం పోరాడతారు. పార్లమెంట్‌లో మీ గొంతు వినిపించేందుకు నేను ఎదురుచూస్తున్నాను.
నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు, మీరు నాపై చూపిన అపారమైన ప్రేమకు ధన్యవాదాలు” అని అన్నారు. యూడీఎఫ్ కూటమిలోని వారు, కార్మికులు, వాలంటీర్లు ఈ ప్రచారంలో చాలా కష్టపడి పనిచేసిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. సోనియా గాంధీ, రాబర్ట్ వాద్రా, రైహాన్, మిరాయా ఇచ్చిన ప్రేమ, ధైర్యానికి ఏ కృతజ్ఞతా సరిపోదని పేర్కొన్నారు.
తన సోదరుడు రాహుల్ అందరికంటే ధైర్యవంతుడని చెప్పారు. తనకు దారి చూపినందుకు, ఎల్లప్పుడూ తన వెన్నంటే ఉంటున్నందుకు ధన్యవాదాలని అన్నారు. ప్రియాంకా గాంధీకి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సహా పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- DPIFF 2025 Welcomes Renowned Astrologer Dr. Sohini Sastri as Jury Member for the Prestigious Film Festival
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







