వెదర్ అప్డేట్.. ఈ వారం బహ్రెయిన్‌లో భారీ మార్పులు..!!
- November 25, 2024
మనామా: బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలోని వాతావరణ శాస్త్ర డైరెక్టరేట్ వెదర్ అలెర్ట్ జారీ చేసింది. ఆటం టూ వింటర్ లోకి ప్రవేశిస్తోందని, రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది.
వర్షపాతం, అల్పపీడనం
తాజా వాతావరణ అప్‌డేట్‌ల ప్రకారం.. నవంబర్ 27 నుండి బహ్రెయిన్‌పై అల్పపీడన వ్యవస్థ ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో నవంబర్ 28 న గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, ఆ సమయంలో వివిధ ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బలమైన గాలులు
నవంబర్ 27 నుండి చురుకైన వాయువ్య గాలులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించనున్నాయి. నవంబర్ 28 నాటికి క్రమంగా తీవ్రతరం అవుతుంది. గాలులు నవంబర్ 30 వరకు బలంగా ఉంటాయని భావిస్తున్నారు.
జాగ్రత్తలు
వాతావరణ శాఖ తాజా బులెటిన్‌లతో అప్‌డేట్ కావాలని, భద్రతా జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాస్త్ర డైరెక్టరేట్ నివాసితులను కోరింది. రానున్న రోజుల్లో గాలులు క్రమంగా తగ్గుతాయని తెలిపింది.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







