సివిల్ ఏవియేషన్ లో బహ్రెయిన్ –యూఏఈ ఒప్పందం..!!
- November 26, 2024
మనామా: సివిల్ ఏవియేషన్ లో బహ్రెయిన్ –యూఏఈ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన పౌర విమానయాన వ్యవహారాలు (CAA).. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) ఒక అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేశాయి. ఈ ప్రాంతంలో సివిల్ ఏవియేషన్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందనిబహ్రెయిన్ రవాణా మంత్రి డా. షేక్ అబ్దుల్లా అన్నారు. ఈ భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో బహ్రెయిన్‌కు చెందిన హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కీలక భూమిక వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, యూఏఈ వైస్ ప్రెసిడెంట్ ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
పౌర విమానయాన సహకారాన్ని బలోపేతం చేయడంలో, ఏవియేషన్ రంగంలో ప్రపంచ అత్యుత్తమ పద్ధతులను అవలంబించడంలో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా పరిగణించబడుతుందన్నారు. పౌర విమానయానంలో మహిళలకు మద్దతు ఇవ్వాలనే నిబద్ధతను కూడా ఎంఓయూ హైలైట్ చేస్తుందని, ఈ రంగంలో కొత్త టెక్నాలజీని పరస్పరం పంచుకోనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
- టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
- హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!







