10 కొత్త మార్గాలను ప్రకటించిన ఎతిహాద్..!!
- November 26, 2024
యూఏఈ: అబుదాబిని ప్రధాన ఆసియా పసిఫిక్ నగరాలతో కలుపుతూ వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న 10 కొత్త గమ్యస్థానాలను ఎతిహాద్ ప్రకటించింది. జూలై 2025 నుండి ప్రారంభమయ్యే కొత్త రూట్లలో అట్లాంటా, తైపీ, మెడాన్, నమ్ పెన్, క్రాబీ, టునిస్, చియాంగ్ మాయి, హాంకాంగ్, హనోయి, అల్జీర్స్ ఉన్నాయి. యూఏఈకి ఈ దేశాల నుండి వచ్చే పర్యాటకులు, ప్రజల సంఖ్య పెరుగుతున్నందున కొత్త ప్రదేశాలను ఎంపిక చేసినట్టు ఎతిహాద్ తెలిపింది. కొత్త సర్వీసుల ప్రారంభంతో ఈ నగరాలకు యూఏఈ నుండి మాది మాత్రమే నాన్‌స్టాప్ ఫ్లైట్ అవుతుందని ఎతిహాద్లోని రెవిన్యూ, కమర్షియల్ ఆఫీసర్ అరిక్ డి చీఫ్ అన్నారు.
చాలా విమానాలు యూరప్‌కి కనెక్ట్ అయ్యేలా ఆప్టిమైజ్ చేసినట్టు తెలిపారు. హనోయి (వియత్నాం) నుండి పారిస్‌కు వెళ్లాలనుకుంటే, ఈ ప్రాంతంలోని ఇతర విమానయాన సంస్థల కంటే ఎతిహాద్ వేగవంతమైన కనెక్టివిటీని కలిగి ఉందన్నారు. ట్యునీషియా, అల్జీరియన్ రాజధానులకు విమానాలను ప్రవేశపెట్టడం వలన ఈ దేశాల నుండి వేలాది మంది నివాసితులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. నవంబర్ 1న ట్యూనిస్‌కు మూడు వీక్లీ విమానాలు, నవంబర్ 7న అల్జీర్స్‌కు నాలుగు వీక్లీ విమానాలు ప్రారంభమవుతాయన్నారు. జూలై 2 నుండి అట్లాంటాకు నాలుగు వీక్లీ విమానాలు ప్రారంభం అవుతుందన్నారు. న్యూయార్క్, వాషింగ్టన్, చికాగో, ఇటీవల బోస్టన్ తర్వాత ఎతిహాడ్ నేరుగా ప్రయాణించే ఐదవ అమెరికా గమ్యస్థానంగా అట్లాంటా అవుతుందన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







