మార్షల్ ఆర్ట్స్ యోధుడు-బ్రూస్ లీ
- November 27, 2024
మార్షల్ ఆర్ట్స్ పేరు వినగానే మనందరికి గుర్తొచ్చే పేరు బ్రూస్ లీ.తరాలు మారుతున్నా మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకోవాలని ఆసక్తి కనబర్చే వారికి ఆయనే ఆదర్శం.ప్రత్యర్థి ఎవరైనా సరే లీ పవర్ పంచ్‌ల దాటికి నిలబడలేకపోయేవారు. కేవలం మార్షల్ ఆర్ట్స్ నేపథ్య సినిమాల్లోనే హీరోగా నటించి అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టించిన ఘనత బ్రూస్ లీకే దక్కుతుంది. 20వ శతాబ్దం యొక్క కల్చరల్ ఐకాన్ గా సైతం ప్రశంసలు అందుకున్నాడు. నేడు మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం బ్రూస్ లీ జయంతి.
బ్రూస్ లీ 1940, నవంబర్ 27న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ ఫ్రాన్సిస్కో అనే నగరంలో హాంగ్‌కాంగ్ కి చెందిన చైనా దంపతులకు జన్మించాడు. లీ నాలుగు నెలల వయసులో అతని తల్లిదండ్రులు తిరిగి హాంగ్‌కాంగ్ కి తిరిగి వెళ్లిపోయారు. సినీ మరియు సంగీత నేపథ్యం కలిగిన కుటుంబంలో పుట్టడం వల్ల తన తండ్రికి ఉన్న పరిచయాల కారణంగా చిన్నతనంలోనే చైనీస్ సినిమాల్లో బాలనటుడిగా నటించడం మొదలు పెట్టాడు.18 సంవత్సరాల వయసు వచ్చేసరికి 20 చిత్రాల్లో నటించాడు.హై స్కూల్ విద్యతోనే చదువుకు ముగింపు పలికాడు.
1953లో చైనీస్ మార్షల్ ఆర్ట్స్ యోధుడు ఇప్ మ్యాన్ వద్ద వింగ్ చున్ యుద్ధ క్రీడలో శిక్షణ పొందాడు. తన తుది శ్వాస వరకు గురువు ఇప్ మ్యాన్ మీద ఎంతో కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండేవాడు.వింగ్ చున్ నేర్చుకున్న పాశ్చాత దేశాల్లో మంచి క్రేజ్ ఉన్న మార్షల్ ఆర్ట్స్ మీద దృష్టి సారించాడు లీ. తండ్రిని ఒప్పించి అమెరికా వెళ్లి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందాడు. అమెరికాలో తనే స్వయంగా మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ఓపెన్ చేసి శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టాడు.
1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో మొట్టమొదటిసారి అతను ఈ పంచ్‌ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆబ్జెక్ట్‌కు కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి, కనురెప్ప కాలంలో బలమైన పంచ్‌ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరూ గుర్తించలేకపోయారు. చాలాకాలం ఈ విధానంపై అధ్యయనాలు జరిగాయి. చివరికి టెక్నిక్‌తో మాత్రమే ఇది సాధ్యమవుతుందన్న నిర్ధారణకు వచ్చారు. సహజంగా శక్తినంతా కూడగట్టుకొని, చేతిని బలంగా విసిరితే తప్ప బలమైన దెబ్బ తగలదు.
మార్షల్ ఆర్ట్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లీకి ఉన్న క్రేజ్ ను గుర్తించారు అమెరికన్ సినీ దర్శకులు. లీ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు సినిమాలు తీయడం మొదలు పెట్టారు. 1966-71హాలీవుడ్ సినిమాల్లో నటించిన లీ, తన మార్షల్ ఆర్ట్స్ తో కూడిన నటనతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందటమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాడు. 1970ల నుంచి తన మాతృదేశమైన హాంగ్‌కాంగ్ కేంద్రంగా తీస్తున్న చైనా సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. తన సినీ కెరీర్లో 37 చిత్రాలు, 52 డాక్యుమెంటరీ చిత్రాలు, 20 టెలి ఫిలిమ్స్ లో నటించాడు.
తన తరం మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు ఫిజికల్ కండిషనింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించేవారు కాదని బ్రూస్ లీ అభిప్రాయపడేవాడు. అన్నిరకాలుగా ఫిట్ గా ఉండటం కోసం బాగా కసరత్తు చేసేవాడు. వింగ్ చున్ విధానంలోని వన్ ఇంచ్ పంచ్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు. 1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో మొట్టమొదటిసారి అతను ఈ పంచ్‌ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వస్తువుకు కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి, కనురెప్ప కాలంలో బలమైన పంచ్‌ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరూ గుర్తించలేకపోయారు. చాలాకాలం ఈ విధానంపై అధ్యయనాలు జరిగాయి. చివరికి టెక్నిక్‌తో మాత్రమే ఇది సాధ్యమవుతుందన్న నిర్ధారణకు వచ్చారు.
సహజంగా శక్తినంతా కూడగట్టుకొని, చేతిని బలంగా విసిరితే తప్ప బలమైన దెబ్బ తగలదు. కానీ, బ్రూస్ లీ మందంగా ఉండే చెక్కను సైతం వన్ ఇంచ్ పంచ్‌తో ముక్కలు చేసేవాడు. వస్తువుకు అతి సమీపం నుంచి కొడితే అంత బలమైన దెబ్బ తగులుతుందన్నది ఆశ్చర్యం కలిగించినా, అది అక్షరసత్యమని నిరూపించాడు బ్రూస్ లీ. ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్‌లో వన్ ఇంచ్ పంచ్ ఒక భాగమైంది. అయితే, అపారమైన అనుభవం ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. ఐదు దశాబ్దాల క్రితమే వన్ ఇంచ్ పంచ్ ని ప్రపంచానికి పరిచయం చేశాడు.
1973 జులై 20 న ఎంటర్ ది డ్రాగన్ సినిమాకు గోల్డెన్ హార్వెస్ట్ అనే స్టూడియోలో డబ్బింగ్ జరుగుతుండగా లీ ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. మెదడు విపరీతంగా ఉబ్బిపోవడం దీనికి కారణం.వెంటనే లీని హాంకాంగ్ బాప్టిస్ట్ హాస్పిటల్ కు తరలించారు.అప్పటికీ బ్రూస్ లీ కోమాలోకి వెళ్ళిపోయారు. ఒక గంటలోనే చనిపోయాడు.లీ మరణించి ఐదు దశాబ్దాలు కావొస్తున్నా ఇప్పటికి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.మార్షల్ ఆర్ట్స్ రారాజుగా తనని అభిమానించే అభిమానుల సంఖ్య ఇప్పటికి పెరుగుతూనే ఉంది.మార్షల్ ఆర్ట్స్ ఉన్నంత కాలం బ్రూస్ లీ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాడు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







