నవంబర్ 29న వఫ్రాలో ఇండియన్ ఎంబసీ 'కాన్సులర్ క్యాంప్'..!!

- November 27, 2024 , by Maagulf
నవంబర్ 29న వఫ్రాలో ఇండియన్ ఎంబసీ \'కాన్సులర్ క్యాంప్\'..!!

కువైట్: నవంబర్ 29న వఫ్రాలో భారత రాయబార కార్యాలయం కాన్సులర్ క్యాంప్‌ను నిర్వహించనుంది. అల్ వఫ్రా ఫ్యామిలీ కోఆపరేటివ్ సొసైటీ సమీపంలోని ఫైసల్ ఫామ్, వఫ్రా, బ్లాక్-09, లైన్-10, రోడ్ 500 వద్ద ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు కాన్సులర్ క్యాంపు జరుగుతుంది.

ఈ కాన్సులర్ క్యాంప్ సమయంలో ఎంబసీ పాస్‌పోర్ట్ పునరుద్ధరణ (ఆన్‌లైన్ ఫారమ్ ఫిల్లింగ్, ఫోటోగ్రాఫ్ మొదలైన వాటితో సహా), రిలేషన్ షిప్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌ట్రాక్ట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, సిగ్నేచర్ అటెస్టేషన్, ఇతర సాధారణ ధృవీకరణ సేవలతో సహా పలు సేవలను అందిస్తుంది.

ఈ శిబిరంలో భారతీయ జాతీయులు కార్మిక సంబంధ ఫిర్యాదులను (వీసా-20, వీసా-18 ) నమోదు చేసుకోవచ్చు. అన్ని ధృవీకరించబడిన పత్రాలను అక్కడికక్కడే పంపిణీ చేస్తారు. కాన్సులర్ సేవల సమయంలో నగదు చెల్లింపు మాత్రమే ఆమోదించబడుతుంది. ఈ సందర్భంగా ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ ప్రజలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com