RO49.99 తో సలామ్ ఎయిర్ నైరోబీకి నాన్-స్టాప్ విమాన సర్వీసులు
- November 27, 2024
మస్కట్: ఒమాన్ యొక్క తక్కువ ధరల విమానయాన సంస్థ సలామ్ ఎయిర్ మస్కట్ నుండి నైరోబీకి నాన్-స్టాప్ విమానాలను ప్రారంభించింది.కొత్తగా ప్రారంభించిన ఈ సర్వీసులు ఫిబ్రవరి 2025 నుండి అందుబాటులోకి వస్తాయి.ఈ విమానాలు వారానికి రెండు సార్లు నడుస్తాయి.ఈ విమాన సర్వీసుతో ప్రయాణికులకు నైరోబీ యొక్క సాంస్కృతిక వైభవం, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణులను తక్కువ ధరలో అన్వేషించవచ్చు.
ఈ సందర్భంగా సలామ్ ఎయిర్ సీఈఓ ఎడ్రియన్ హామిల్టన్-మాన్సు మాట్లాడుతూ అతి తక్కువ ధరలో మంచి సర్వీసులను అందిస్తున్న సలాం ఎయిర్ తమ విస్తృత నెట్‌వర్క్‌లో నైరోబీని చేర్చడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నామనీ తెలిపారు. ఇది ఆఫ్రికా మార్కెట్‌లో మా విస్తరణలో ఒక ముఖ్యమైన మైలురాయి. నైరోబీ అంతర్జాతీయ ప్రయాణికులకు ఒక కేంద్రంగా మాత్రమే కాకుండా వ్యాపారం సాంకేతికత మరియు విద్యా రంగాలలో కూడా అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా ఉంది. ఈ కొత్త మార్గం ద్వారా, తక్కువ ధరలతో ప్రయాణికులను అనేక గమ్యస్థానాలకు అనుసంధానించగలము అని అన్నారు.
తక్కువ ధరల ప్రయాణానికి కట్టుబడి ఉన్న సలాం ఎయిర్ నైరోబీ మార్గంలో లైట్ ఫేర్ RO49.99 నుండి ప్రారంభమవుతుంది. ఇది ఇతర విమానయాన సంస్థల కంటే 70% తక్కువ ధర. ఈ కొత్త మార్గం ద్వారా, సలామ్ ఎయిర్ మధ్యప్రాచ్యం మరియు తూర్పు ఆఫ్రికా మధ్య పర్యాటక మరియు వాణిజ్య సంబంధాలను పెంపొందించడంలో సహాయపడుతుంది.
సలామ్ ఎయిర్ 2017లో ప్రారంభమై ఒమాన్‌లో చౌకైన విమాన ప్రయాణాన్ని అందించడంలో దృష్టి పెట్టింది.ప్రస్తుతం 13 ఎయిర్‌బస్ A320 లాంటి విమానాలతో 18 దేశాలలో 37 నగరాలకు సేవలు అందిస్తోంది. 2022 మరియు 2023లో ఒమాన్ యొక్క అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా సలామ్ ఎయిర్ గుర్తింపు పొందింది.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!







