గేమ్ ఛేంజర్ నుంచి కొత్త సాంగ్ పోస్టర్ రిలీజ్.. మెలోడీ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..

- November 28, 2024 , by Maagulf
గేమ్ ఛేంజర్ నుంచి కొత్త సాంగ్ పోస్టర్ రిలీజ్.. మెలోడీ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..

గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇప్పటికే రెండు మాస్ పాటలు, టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. ఇప్పుడు మూడో పాట రిలీజ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా గేమ్ ఛేంజర్ లో మూడో సాంగ్ అని అభిమానులను ఊరిస్తున్నారు. ఇప్పటికే చిన్న ప్రోమో విడుదల చేయగా అదిరిపోయింది అంటూ ఆ పాట వైరల్ అవుతుంది.

గేమ్ ఛేంజర్ సినిమాలో నానా హైరానా.. అనే మెలోడీ సాంగ్ ను నేడు సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ అప్డేట్ ఇస్తూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో చరణ్, కియారా చాలా రిచ్ లుక్ లో కనిపిస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ ఈ పాట కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో శ్రేయ గోషాల్, కార్తీక్ పాడారు. ఈ పాటకు బాస్కో మార్టిన్ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేసారు. గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ పాటను తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com