దుబాయ్ లో సలిక్ టోల్ రేట్లు, పార్కింగ్ ధరలు..ప్రకటించిన ఆర్టీఏ..!!
- November 29, 2024
దుబాయ్: దుబాయ్ నగరంలో ట్రాఫిక్ ప్లోను పెంచే సమగ్ర వ్యూహం అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా వేరియబుల్ రోడ్ టోల్ ప్రైసింగ్ (సాలిక్), వేరియబుల్ పార్కింగ్ టారిఫ్ విధానాలను అమలు చేయనున్నట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. వేరియబుల్ రోడ్ టోల్ ప్రైసింగ్ (సాలిక్) సిస్టమ్ జనవరి 2025 చివరిలో ప్రారంభించబడుతుందని, వాహనదారులకు ఉదయం 1 నుండి ఉదయం 6 గంటల మధ్య టోల్-ఫ్రీ ప్రయాణాన్ని అందిస్తుందని తెలిపారు.
ఇక వీకెండ్లలో ఉదయం పీక్ అవర్స్ (ఉదయం 6 నుండి 10 గంటల వరకు), సాయంత్రం పీక్ అవర్స్ (సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు) సమయంలో టోల్ 6 దిర్హామ్‌లుగా నిర్ణయించారు. రద్దీ లేని సమయాలలో ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల మధ్య మరియు రాత్రి 8 నుండి తెల్లవారుజామున 1 గంటల వరకు, టోల్ 4 దిర్హామ్‌లుగా ఉంటుంది. ఆదివారాలు, ప్రభుత్వ సెలవులు, ప్రత్యేక సందర్భాలు లేదా ప్రధాన ఈవెంట్‌లు మినహా రోజంతా టోల్ Dh4 ఉంటుంది.
వేరియబుల్ పార్కింగ్ టారిఫ్ పాలసీ మార్చి 2025 చివరి నాటికి అమల్లోకి రానుంది. ఇందులో ప్రీమియం పార్కింగ్ స్థలాలకు గంటకు Dh6, ఉదయం పీక్ అవర్స్ (ఉదయం 8 నుండి 10వరకు), సాయంత్రం పీక్ అవర్స్(సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు)లో ఇతర పబ్లిక్ పెయిడ్ పార్కింగ్ స్థలాలకు గంటకు Dh4 చొప్పున పార్కింగ్ రుసుమును నిర్ణయించారు. రద్దీ లేని సమయాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు రుసుములు మారవు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు, ఆదివారం రోజంతా పార్కింగ్ ఉచితం అని ప్రకటించారు.
రద్దీ ధరల విధానం
ఈవెంట్ ప్రాంతాల కోసం రద్దీ ధరల విధానం ఈవెంట్ జోన్‌లకు సమీపంలో పబ్లిక్ పెయిడ్ పార్కింగ్ స్థలాలకు గంటకు Dh25 రుసుమును వసూలు చేయనున్నారు. 2025 ఫిబ్రవరి నుండి ప్రారంభమయ్యే ప్రధాన ఈవెంట్‌ల నుండి ఈ విధానం అమల్లోకి రానుంది. మొదట దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ చుట్టూ అమలు చేయనున్నట్లు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







