ఫోర్జరీ సాలరీ సర్టిఫికేట్లతో లోన్ స్కామ్‌..నిందితులు అరెస్ట్..!!

- December 03, 2024 , by Maagulf
ఫోర్జరీ సాలరీ సర్టిఫికేట్లతో లోన్ స్కామ్‌..నిందితులు అరెస్ట్..!!

మనామా: వ్యక్తిగత రుణాలు పొందడానికి ప్రభుత్వ పత్రాలను నకిలీ చేసినందుకు ముగ్గురు ఆసియా వ్యక్తులపై ఫోర్జరీ, మోసం అభియోగాలను నమోదు చేశారు.  ప్రధాన నిందితుడు, అతని ఇద్దరు సహచరులు. బహ్రెయిన్ ప్రభుత్వ ఏజెన్సీకి సెక్యూరిటీ గార్డులుగా పనిచేశారు. ఒక్కొక్కరు BD39,000 కంటే ఎక్కువ రుణాలు పొందేందుకు వారి జీతాలను పెంచి చూపారని అభియోగాలు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.  నిందితులు మరో వ్యక్తితో కలిసి సాలరీ సర్టిఫికేట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌ల వంటి అధికారిక పత్రాలను ఫోర్జరీ చేశారని ప్రాసిక్యూషన్ పేర్కొంది.  వీటిని నిందితులు రుణాలు పొందేందుకు ఈ నకిలీ పత్రాలను ఉపయోగించారని తెలిపారు.  

సెక్యూరిటీ గార్డులు కూడా బ్యాంకు ప్రతినిధితో కలిసి ఈ నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. అసాధారణంగా అధిక జీతాలు క్లెయిమ్ చేస్తూ అనేక మంది వ్యక్తుల నుండి రుణ దరఖాస్తులలో అసమానతలను బ్యాంక్ సేల్స్ మేనేజర్ గమనించిన సమయంలో ఈ స్కామ్ గురించి బయటపడింది. సంబంధిత ప్రభుత్వ యంత్రాంగంతో తనిఖీ చేయగా, ఫోర్జరీ వ్యవహారం బయటపడింది.  ఒక్కొక్కరి జీతాలను BD255 నుండి BD2,000కి పెంచినట్టు గుర్తించారు.  ఇందు కోసం అనధికార సంతకాలు, ఒరిజినల్ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినట్టు బ్యాంకు అధికారులు ధృవీకరించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com