డిసెంబర్ తర్వాత ఒమన్ లో ఈ బ్యాంకు నోట్లు పనిచేయవు..!!
- December 03, 2024
మస్కట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్ (CBO) జాతీయ కరెన్సీ నిర్దిష్ట విలువలను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ 2024,జనవరి 7న ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ డినామినేషన్లు చెలామణి నుండి ఉపసంహరించనున్నారు. డిసెంబర్ 31, 2024 తర్వాత కింది బ్యాంకు నోట్లు రద్దవుతాయి.
1995 ఐదవ ఇష్యూ నుండి బ్యాంకు నోట్లు
2000 సవరించిన ఇష్యూ నుండి బ్యాంకు నోట్లు
2005 నాటి OMR 1 స్మారక నోటు
2010 నాటి OMR 20 స్మారక నోటు
2011, 2012 సవరించిన ఇష్యూ నుండి బ్యాంకు నోట్లు
2015 OMR 1 స్మారక నోటు.
2019 సవరించబడిన OMR 50 నోటు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ సుల్తానేట్ పరిధిలో ఉన్న అన్ని బ్యాంకులు ఈ విషయాన్ని గమనించాలని, సంబంధిత డినామినేషన్లను అంగీకరించాలని, వాటిని నిర్దిష్ట వ్యవధిలో ఆరవ ఇష్యూ నుండి బ్యాంక్ నోట్లతో మార్పిడి చేసి ఇవ్వాలని ఆదేశించింది. అదేసమయంలో ఒమన్‌లోని అన్ని సంస్థలు, వాణిజ్య సంస్థలు ప్రజల నుండి ఈ డినామినేషన్లను అంగీకరించాలని, తరువాత వాటిని స్థానిక బ్యాంకులలో డిపాజిట్ చేయాలని కోరింది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







