పార్టనర్‌షిప్ సమ్మిట్ 2024..భారత్-ఖతార్ మధ్య కీలక చర్చలు..!!
- December 04, 2024
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన పార్టనర్‌షిప్ సమ్మిట్ 2024 29వ ఎడిషన్‌లో ఖతార్ పాల్గొన్నది. ఖతార్ ప్రతినిధి బృందానికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలో విదేశీ వాణిజ్య వ్యవహారాల శాఖ సహాయ మంత్రి HE డా. అహ్మద్ బిన్ మహ్మద్ అల్ సయ్యద్ ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా ఇండియాతో వాణిజ్యం, పెట్టుబడి సహకారాన్ని పెంపొందించడానికి.. ఉమ్మడి ఆసక్తి ఉన్న వివిధ రంగాలలో వాణిజ్య భాగస్వామ్య అవకాశాలను విస్తరించే దిశగా చర్చించారు. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది.
రెండు దేశాల మధ్య బలమై ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం 2020 నుండి 55 శాతం వృద్ధిని సాధించి, 2023లో దాదాపు 14 బిలియన్ డాలర్లకు చేరుకుందని పేర్కొన్నారు. ఇండియా, ఖతార్ రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని తెలిపారు. సమ్మిట్ సందర్భంగా ఇండియా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో అహ్మద్ బిన్ మహ్మద్ అల్ సయ్యద్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రైవేట్ రంగాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ చైర్మన్, సమ్మిట్ కో-ఛైర్ మంత్రి సంజీవ్ పూరిని కలిసి చర్చించారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







