బాలీవుడ్ స్టార్లతో పెట్టుకుంటే బాహుబలి వచ్చేదే కాదు
- June 26, 2016
వెండితెర దృశ్యకావ్యంగా బాహుబలి సినిమాను తెరకెక్కించి జాతీయంగా, అంతర్జాతీయంగా దర్శకుడు రాజమౌళి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఈ సినిమాకుగాను జాతీయ అవార్డు అందుకున్న రాజమౌళి ఐఏఎన్ఎస్ వార్తాసంస్థకు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.బాహుబలి సినిమాను ఎందుకు నేరుగా హిందీలో తెరకెక్కించలేదన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. 'బాహుబలి: ద బిగినింగ్ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు నా చేతిలో స్క్రిప్ట్ తోపాటు షెడ్యూల్ కూడా రెడీగా ఉంది. ఈ సినిమా కోసం ఎంతలేదన్న రెండేళ్లు డేట్స్ ఇచ్చే స్టార్లు కావాలని మాకు తెలుసు. రెండేళ్లపాటు ఎలాంటి కమిట్ మెంట్స్ లేకుండా బాలీవుడ్ లో ఎవరైనా డేట్స్ ఇవ్వగలరా? బాలీవుడ్ స్టార్లను పెట్టుకొని ఉంటే ఈ సినిమా వచ్చేది కాదు' అని చెప్పారు. ప్రతి సినిమాను పలు భాషల్లో విడుదల చేయాల్సిన అవసరముందా అన్న ప్రశ్నకు.. ' ప్రతి సినిమాను అన్ని భాషల్లో విడుదల చేయలేం. కుల,మత, జాతి, భాషలకు అతీతంగా అందరికీ వర్తించే మానవ భావోద్వేగాలు ఉన్న కథతో సినిమా తీసినప్పుడు దానిని అన్ని భాషల్లో విడుదల చేయవచ్చు' అని పేర్కొన్నారు. సగటు కథలతో తీసే సినిమాలను థియేటర్ల వద్ద పెద్దగా సందడి చేయబోవని ఆయన అభిప్రాయపడ్డారు. చారిత్రక కథనంతో తెరకెక్కిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







