బెల్జియన్ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్..దుబాయ్‌లో అరెస్ట్..!!
- December 05, 2024
దుబాయ్: బెల్జియం మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికర్లలో ఒకరైన ఒత్మాన్ ఎల్ బల్లూటిని దుబాయ్‌లో అరెస్టు చేశారు. బ్రస్సెల్స్ అతనిని అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారని దుబాయ్ న్యాయశాఖ అధికారులు వెల్లడించారు. ఐరోపాలోని ప్రధాన డ్రగ్ గేట్‌వేలలో ఒకటైన బెల్జియన్ పోర్ట్ ఆఫ్ ఆంట్‌వెర్ప్‌లో ఎల్ బల్లౌటి ప్రధాన డ్రగ్ స్మగ్లింగ్ రింగ్‌ను నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బెల్జియం, యూఏఈ 2021లో నేరస్తుల అప్పగింత ఒప్పందంపై సంతకం చేశాయి.
ఎల్ బల్లూటీ క్రైమ్ రింగ్ "యూరోప్ అంతటా విస్తృత పంపిణీ కోసం బెల్జియంలోని ఆంట్వెర్ప్ నౌకాశ్రయం ద్వారా షిప్పింగ్ కంటైనర్ల ద్వారా గణనీయమైన పరిమాణంలో కొకైన్‌ను అక్రమంగా రవాణా చేస్తుంది" అని అమెరికా ట్రెజరీ తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







