బయోమెట్రిక్ నమోదు లేని ప్రవాసుల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్..!!
- December 05, 2024
కువైట్: ప్రవాసులు తమ బయోమెట్రిక్ వేలిముద్ర నమోదును పూర్తి చేయడానికి డిసెంబర్ 31 గడువు ఉంది. ఆలోపు బయోమెట్రిక్ నమోదులో విఫలమైన వ్యక్తుల ఖాతాలను స్తంభింపజేయడానికి బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. వచ్చే వారం నాటికి బయోమెట్రిక్ పూర్తి చేయని ప్రవాసులకు బ్యాంకులు హెచ్చరిక సందేశాన్ని పంపడం ప్రారంభించనున్నాయి. డిసెంబరు 15వ తేదీ నుండి ఖాతాల యాక్టివిటిలను బ్యాంకులు నిలిపివేస్తాయి. డిసెంబర్ 31లోపు బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయని వారి కోసం క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో సహా అన్ని కార్డులను బ్యాంకులు సస్పెండ్ చేయనున్నాయి. ఆర్థిక, ప్రభుత్వ సేవలకు అంతరాయం లేకుండా చూసుకోవాలని, బయోమెట్రిక్ నమోదును డిసెంబర్ 31 లోపు పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్







