ఐస్లాండ్ అధ్యక్షుడిగా ఎన్నికైన జోహెన్స్సన్
- June 26, 2016
చరిత్ర అధ్యాపకుడు జోహెన్స్సన్ ఐస్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. 39.1శాతం ఓట్లతో ఆయన విజయం సాధించినట్లు అక్కడి పబ్లిక్ టెలివిజన్ ఛానల్ ఆర్‌యూవీ వెల్లడించింది. పనామా పత్రాల కలకలంతో ఐస్లాండ్లో అధ్యక్ష ఎన్నికలు అనివార్యమయ్యాయి.అప్పటి అధ్యక్షుడు సిగ్మండర్ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా ఈ కుంభకోణంలో పలువురు సీనియర్ రాజకీయ నాయకులకు హస్తం ఉన్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జోహెన్స్సన్ విజయం సాధించారు. రాజకీయ పార్టీలతో అనుబంధం లేకుండా స్వతంత్రంగా పోటీచేసిన మహిళా వ్యాపారవేత్త హల్లా టోమస్డాటిర్ 27.9శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఉన్న ఓల్ఫర్ రాగ్నర్ గ్రిమ్సన్ స్థానంలో జోహెన్ససన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







