మంగళవారం నుండి ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయే ప్రక్రియ మొదలు

- June 26, 2016 , by Maagulf
మంగళవారం నుండి ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయే ప్రక్రియ మొదలు

ఈయూ నుంచి విడిపోయే ప్రక్రియను మంగళవారం నుంచి మొదలుపెట్టండని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌కు సూచించింది యురోపియన్ యూనియన్ పార్లమెంట్‌. ప్రక్రియ ఆలస్యమయ్యేకొద్దీ అభద్రతాభావం పెరిగిపోతుందని, ఉద్యోగాలపై ప్రభావం చూపిస్తుందని మార్టిన్ షుల్జ్ అన్నారు. పార్టీ విధివిధానాల రూపకల్పన కోసం మొత్తం ప్రక్రియను మొదలుపెట్టడానికి వెనకాముందు కావడం అందరికీ నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకే ఈయూ సదస్సు మొదలయ్యే మంగళవారం నుంచే విడాకుల ప్రక్రియ మొదలుపెట్టాలని సూచించారు. యురోపియన్ పార్లమెంట్‌లోని నాలుగు మేజర్ గ్రూప్స్ ఈ మేరకు ఓ ముసాయిదా తీర్మానం చేశాయి. యూనియన్ సమగ్రతను కాపాడేందుకు, అనిశ్చితికి తెరదించేందుకు ఇది తోడ్పడుతుందని ఈయూ అభిప్రాయపడింది. అయితే ఈ ప్రక్రియను ప్రారంభించాలంటే లిస్బన్ ఒప్పందంలోని ఆర్టికల్ 50ని బ్రిటన్ ప్రయోగించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ముందు యూరో కౌన్సిల్‌కు బ్రిటన్ తమ నిర్ణయం చెబితే వారు రెండేళ్ల సంప్రదింపుల ప్రక్రియను మొదలుపెడతారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది యూరో కౌన్సిల్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com