ముస్లిం సోదరులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు
- June 26, 2016
రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నిజాం కళాశాల గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం మాట్లాడారు. ఈ ఏడాది 120 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. మైనార్టీల రిజర్వేషన్ల కోసం కమిటీ వేశామన్నారు. కమిటీ నివేదిక రాగానే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానాన్ని ఢిల్లీకి పంపుతామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధఃగా మైనార్టీలకు అధిక నిధులు కేటాయించామని గుర్తు చేశారు. ఇఫ్తార్ విందులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, డి. శ్రీనివాస్, ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







