సౌదీలో మొదటి హైడ్రోజన్‌ బస్సు టెస్ట్ డ్రైవ్ ప్రారంభం..!!

- December 06, 2024 , by Maagulf
సౌదీలో మొదటి హైడ్రోజన్‌ బస్సు టెస్ట్ డ్రైవ్ ప్రారంభం..!!

అల్-అహ్సా: సౌదీ అరేబియాలో హైడ్రోజన్‌తో నడిచే మొట్టమొదటి బస్సు ట్రయల్ రన్‌ను అల్-అహ్సా గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ తలాల్ బిన్ బదర్ ప్రారంభించారు. ఈ బస్సు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 635 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 45 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇది దమ్మామ్ నగరం-అల్-అహ్సా గవర్నరేట్‌ మధ్య నడుస్తుంది.  SATCO సంస్థ ద్వారా నడిచే ఇది రోజులో మొత్తం 359 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో రవాణా, లాజిస్టిక్స్ డిప్యూటీ మంత్రి, రవాణా జనరల్ అథారిటీ (TGA) తాత్కాలిక అధ్యక్షుడు డా. రుమైహ్ అల్-రుమైహ్ పాల్గొన్నారు. ప్రారంభోత్సవ వేడుకలో ప్రిన్స్ సౌద్ హైడ్రోజన్ బస్సుల ఆపరేషన్, ఇంధనం నింపే ప్రక్రియ, వాటి భద్రతా ప్రమాణాలు, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహకారం గురించి వివరించే వీడియోను వీక్షించారు.

సౌదీ విజన్ 2030 సాధించడంలో రాజ్యంలో మొట్టమొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే బస్సును అల్-అహ్సాలో ప్రారంభించడం ఒక ముఖ్యమైన అడుగు అని ప్రిన్స్ సౌద్ అన్నారు. ఇది పర్యావరణ స్థిరత్వం, పర్యావరణ అనుకూల సాంకేతికతలను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుందని, అల్-అహ్సా నివాసితులు, సందర్శకుల కోసం జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com