తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే వారికి బిగ్ అలెర్ట్!
- December 07, 2024తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇక మరోవైపు తిరుమల తిరుపతి లోనూ భారీ వర్షాల కారణంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.
తిరుమలలో వర్షాలు .. భక్తుల సాధారణ రద్దీ
కలియుగ వైకుంఠమైన తిరుమలలో కురుస్తున్న వర్షాల కారణంగా రెండవ ఘాట్ రోడ్లో ఇప్పటికే కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ఎప్పటికప్పుడు జెసిబి లతో బండరాళ్ళను తొలగిస్తున్నారు. ఇక మరోవైపు గోగర్భం డాం పూర్తిగా నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక వర్షం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
మెట్ల మార్గం తాత్కాలిక మూసివేత ఉచిత సర్వదర్శనానికి నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని, 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మెట్ల మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు టీటీడీ కీలక అలర్ట్ ఇచ్చింది.
ఏపీలో ఫెంగల్ తుఫాన్ బీభత్సం. భారీ వర్షాలతో హెచ్చరికలు..మెట్ల మార్గం తాత్కాలిక మూసివేత ఇందుకే స్వామివారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు వర్షాలు కురుస్తున్న కారణంగా మెట్ల మార్గం ద్వారా రావడానికి వీలులేదని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో మెట్ల మార్గాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు వర్షం కారణంగా అడవిలోని జంతువులు కొన్నిసార్లు మెట్ల మార్గం వైపుకు వస్తుంటాయని, దీని కారణంగా భక్తులకు అటు జంతువులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రస్తుతం మెట్ల మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు పేర్కొన్నారు.
తిరుమలకు వచ్చే భక్తులకు సూచన ఇక వర్షాలు తగ్గిన తర్వాత తిరిగి మెట్ల మార్గం గుండా భక్తులను అనుమతించనున్నారు. ఒకవైపు తుఫాను మరోవైపు చల్లని గాలుల కారణంగా తిరుమలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను చేస్తోంది.అంతేకాదు ప్రస్తుత వర్షాల పరిస్థితిని తెలుసుకుని తగిన జాగ్రత్తలతో భక్తులు తిరుమలకు రావాలని కూడా టీటీడీ సూచించింది.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!