మోటార్‌సైకిలిస్ట్ దాడిలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డు..!!
- December 07, 2024
మనామా: బహ్రెయిన్‌లోని స్థానిక మాల్‌లో ఒక సెక్యూరిటీ గార్డుపై మోటార్‌సైకిలిస్ట్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో సెక్యూరిటీ గార్డు 1% శాశ్వత వైకల్యాన్ని పొందాడు. సెక్యూరిటీ గార్డు డ్యూటీలో ఉండగా, మోటార్‌సైకిలిస్ట్ ను గ్యాస్ రూమ్ నుండి దూరంగా వెళ్లాలని కోరాడు. దాంతో మోటారుసైకిలిస్ట్ ఆగ్రహంతో తన హెల్మెట్‌తో గార్డును అతని ఎడమ చేతిపై మూడుసార్లు బలంగా కొట్టాడు..దాడి ఫలితంగా గార్డు మణికట్టు విరిగడంతోపాటు ఎడమ చేతి చిటికెన వేలికి పగులు ఏర్పడ్డాయి. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో దుండగుడు తన హెల్మెట్‌తో దాడి చేసినట్టు అంగీకరించాడు.
ఫోరెన్సిక్ మెడికల్ రిపోర్ట్ గాయాలకు 20 రోజుల కంటే ఎక్కువ చికిత్స అవసరమని నిర్ధారించారు. గార్డు ఎడమ చేతిపై చిటికెన వేలు వంగడంలో 1% శాశ్వత పరిమితి ఏర్పడింది. సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి 1% శాశ్వత వైకల్యానికి కారణమైనట్లు మోటర్‌సైక్లిస్ట్‌పై అభియోగాలు మోపింది. డిసెంబరు 15వ తేదీన హైక్రిమినల్ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన శిక్ష ఖరారు చేయనున్నారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







