కువైట్ లో అంతర్జాతీయ 'ఫుట్‌బాల్ ఫర్ పీస్' కార్యక్రమం..!!

- December 07, 2024 , by Maagulf
కువైట్ లో అంతర్జాతీయ \'ఫుట్‌బాల్ ఫర్ పీస్\' కార్యక్రమం..!!

కువైట్: కువైట్ లో వచ్చే ఫిబ్రవరిలో అంతర్జాతీయ (ఫుట్‌బాల్ ఫర్ పీస్ ఇన్ కువైట్ - ల్యాండ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ అండ్ పీస్) కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (KRCS), ఐక్యరాజ్యసమితి సహకారంతో మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయా దేశాల రాయబారులు పాల్గొన్నారు. కువైట్, మానవతా దౌత్యాన్ని వ్యాప్తి చేయడం, క్రీడల ద్వారా ప్రజలను ఏకం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ట్రస్టీల బోర్డు చైర్‌పర్సన్, అల్నోవైర్ ఇనిషియేటివ్ ఛైర్‌పర్సన్ షేఖా ఇంతిసార్ సేలం అల్-అలీ అల్-సబా తెలిపారు.ఇండియాతోపాటు ఇటలీ, పాలస్తీనా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, స్పెయిన్, ఈజిప్ట్, ఆర్మేనియా దేశాలు పాల్గొంటున్నాయని తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com